సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ 18వ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.అందులో భాగంగా నిన్నటితో భారీ యాక్షన్ షెడ్యూల్ పూర్తయింది.ఈ షెడ్యూల్ 15 రోజుల పాటు కొనసాగింది.ఇక నెక్స్ట్ షెడ్యూల్ కోసం 12 ఎకరాల్లో సెట్ వేయనున్నారు.దాంతో షూటింగ్ సగానికిపైగా పూర్తికానుంది.1947-67లో జరిగే కథతో తెరకెక్కుతున్న ఈసినిమాలో తేజ్ సరికొత్త అవతారంలో కనిపించనున్నాడు.డిసెంబర్ లోగా షూటింగ్ కంప్లీట్ చేసి వచ్చే ఏడాది సమ్మర్ లో బరిలో నిలుపేలా ప్లాన్ చేస్తున్నారు.విఎఫ్ఎక్స్ వర్క్ కూడా ఎక్కువగానే ఉండనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కొత్త దర్శకుడు రోహిత్ డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాలో ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా నటిస్తుంది.ఇందులో ఐశ్వర్యా,వసంత అనే పాత్ర పోషిస్తుంది.ఇక కంటెంట్ మీద వున్న నమ్మకంతో ఖర్చు వెనుకాడకుండా ఈసినిమాను నిర్మిస్తున్నారు హనుమాన్ నిర్మాతలు నిరంజన్ రెడ్డి,చైతన్య రెడ్డి.దాదాపు 100కోట్ల బడ్జెట్ పెడుతున్నారు.పాన్ ఇండియా మూవీగా విడుదలకానుంది.త్వరలోనే టైటిల్ ను ప్రకటించనున్నారు.అలాగే మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో కూడా క్లారిటీ రావాల్సివుంది.
ఇక గత ఏడాది విరూపాక్షతో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన సాయి దుర్గ తేజ్ ఆతరువాత బ్రోతో డీసెంట్ హిట్ అందుకున్నాడు.మరి SDT 18 తనకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























