రాఘవ లారెన్స్ 25వ చిత్రం షురూ

Raghava Lawrence’s 25th Film Begins Soon

ఉత్తమ విలువలు కలిగిన నిర్మాత, విద్యావేత్త, కె.ఎల్‌. యూనివర్శిటీ ఛైర్మన్‌ కోనేరు సత్యనారాయణ గురించి టాలీవుడ్‌లో తెలియనివారే ఉండరు. ‘రాక్షసుడు’, ‘ఖిలాడీ లాంటి బ్లాక్‌ బస్టర్‌ సినిమాల నిర్మాతగా ఆయన అందరికీ సుపరిచితులు. ఏ స్టూడియోస్‌ ఎల్‌.ఎల్‌.పీ. పతాకంపై పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు కోనేరు సత్యనారాయణ.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో నీలాద్రి ప్రొడక్షన్స్, హవీష్‌ ప్రొడక్షన్స్‌తో కలిసి లేటెస్ట్ ప్రాజెక్టును అనౌన్స్ చేశారు కోనేరు సత్యనారాయణ. తమ సంస్థలో ఇంతకు ముందు రాక్షసుడు, ఖిలాడీ సినిమాలను తెరకెక్కించిన రమేష్‌వర్మతో మరోసారి ప్రాజెక్ట్ చేయనున్నారు కోనేరు సత్యనారాయణ. ఈ సారి బిగ్‌ యాక్షన్‌ అడ్వంచరస్‌కి శ్రీకారం చుట్టనున్నారు. కాగా రమేష్‌ వర్మతో కోనేరు సత్యనారాయణకు ఇది హ్యాట్రిక్‌ కొలాబరేషన్‌.

ఇటీవల వరుస సక్సెస్‌ల మీదున్న రాఘవ లారెన్స్ ఈ తాజా సినిమాలో హీరోగా నటించనున్నారు. అత్యంత భారీ వ్యయంతో ప్రాజెక్టును తెరకెక్కించనున్నారు మేకర్స్. కొరియోగ్రాఫర్‌గా అత్యున్నత ప్రతిభ కనబరిచి హీరోగా మెప్పిస్తున్న రాఘవ లారెన్స్ కెరీర్‌లో ఇది 25వ సినిమా కావడం గమనార్హం. న‌వంబ‌ర్‌లో షూటింగ్‌ను ప్రారంభించి 2025 స‌మ్మ‌ర్‌లో విడుద‌ల చేయ‌టానికి మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు.

కాగా ఈ ప్రాజెక్ట్ ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో తెరకెక్కనుంది. అనౌన్స్‌మెంట్‌ పోస్టర్‌ మీద షాడో అవతార్‌లో రాఘవ లారెన్స్ ఇమేజ్‌ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఎగ్జయిట్‌మెంట్‌ వర్డ్స్ ప్రాజెక్టుకు ఇన్‌స్టంట్‌గా హైప్‌ పెంచుతున్నాయి. టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారిన ఈ క్రేజీ ప్రాజెక్టు గురించి మరిన్ని విషయాలను త్వరలోనే ప్రకటిస్తామంటున్నారు మేకర్స్.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.