ప్రముఖ నటుడు రావు రమేష్ టైటిల్ రోల్ లో నటించిన చిత్రం మారుతీనగర్ సుబ్రహ్మణ్యం.లిమిటెడ్ బడ్జెట్ లో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈసినిమా గత నెలలో విడుదలై డీసెంట్ హిట్ అనిపించుకుంది.దాదాపు 6కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టుకుంది.ఇక ఇప్పుడు ఈసినిమా ఓటిటిలోకి రానుంది.ఆహా ఈసినిమా డిజిటల్ హక్కులు దక్కించుకుంది.దాంతో ఈనెల 20న మారుతీనగర్ సుబ్రమణ్యంను స్ట్రీమింగ్ లోకి తీసుకరానుంది.సో థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన వారు ఓటిటిలో చూడొచ్చు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మిడిల్ క్లాస్ కు చెందిన ఓ మధ్య వయస్కుడు నిరుద్యోగంతో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు అనే కథ తో తెరకెక్కింది ఈసినిమా.ఇందులో రావు రమేష్ నటన,కామెడీ సీన్లు, క్లైమాక్స్ హైలైట్ అయ్యాయి.లక్షణ్ కార్య ఈసినిమాను డైరెక్ట్ చేయగా ఇంద్రజ,అంకిత్ కొయ్య,రమ్య పసుపులేటి కీలక పాత్రల్లో నటించారు.కళ్యాణ్ నాయక్ సంగీతం అందించగా ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ సతీమణి తబిత సుకుమార్ ప్రజెంటర్ గా వ్యవహరించారు.తెలుగు రాష్ట్రాల్లో ఈసినిమాను మైత్రి మూవీ మేకర్స్ రిలీజ్ చేసింది.
ఇక రీసెంట్ గానే పుష్ప 2 షూటింగ్ పూర్తి చేశారు రావు రమేష్.పుష్పలో తను మంత్రిగా కీలక పాత్రలో కనిపించగా సెకండ్ పార్ట్ లోనూ తన పాత్రకు ఇంపార్టెన్స్ ఉండనుంది.ఈసినిమా డిసెంబర్ లో విడుదలకానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























