ఫస్ట్ షెడ్యూల్ పూర్తిచేసుకున్న తెలుసు కదా

Star Boy Siddu Jonnalagadda's Telusu Kada First Schedule in Hyderabad Wrapped Up

స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తోన్న న్యూ మూవీ ‘తెలుసు కదా’. రాశి ఖన్నా, కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి కథానాయికలుగా నటిస్తుండగా.. వైవా హర్ష ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన ఈ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమౌతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లావిష్‌గా నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ మొదటి షెడ్యూల్‌లో కొన్ని టాకీ పార్ట్‌లతో పాటు పాటలను కూడా షూట్ చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దీనిలో భాగంగా సిద్దు జొన్నలగడ్డ, రాశి ఖన్నా లపై సినిమా మొదటి పాటను చిత్రీకరించారు. ఇక ఈ సినిమా కోసం సిద్దూ జొన్నలగడ్డ స్టైలిష్ మేకోవర్ అయ్యారు. ఇటీవలే తెలుసు కదా టీమ్ నటి శ్రీనిధి శెట్టిని బోర్డులోకి స్వాగతించింది. ఇది మొత్తం 30 రోజుల పాటు సాగే క్రూషియల్ షెడ్యూల్ అని మేకర్స్ తెలిపారు. ఈ సినిమా పనులు శరవేగంగాజరుగుతున్నాయి. ఇదిలావుంటే తాజాగా ఈ మూవీ నుంచి కీలక అప్‌డేట్ వచ్చింది.

ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్‌ హైదరాబాద్‌లో పూర్తయింది. నెక్స్ట్ లెన్తీ షెడ్యూల్ కోసం సినిమా యూనిట్ సిద్ధమవుతోంది. ఇప్పటికే 50% షూటింగ్ పూర్తయింది. అవుట్‌పుట్‌తో టీమ్‌ హ్యాపీగా ఉంది. నెల రోజుల పాటు జరిగిన ఈ షెడ్యూల్‌లో సిద్దు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి, వైవా హర్షలపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమాలోని మొదటి పాటను సిద్దు జొన్నలగడ్డ, రాశీఖన్నాలపై చిత్రీకరించారు. వర్కింగ్ స్టిల్స్ సెట్స్‌లో ప్లజెంట్ ఎట్మాస్స్పియర్‌ని ప్రజెంట్ చేస్తున్నాయి.

కాగా స్టార్ ప్రొడ్యూసర్ టిజి విశ్వప్రసాద్‌ హై బడ్జెట్‌తో, టాప్ ప్రొడక్షన్ వాల్యూస్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాలో టాప్ టెక్నీషియన్లు పని చేస్తున్నారు. ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా.. జ్ఞాన శేఖర్ బాబా సినిమాటోగ్రఫీ, నేషనల్ అవార్డ్ విన్నింగ్ టెక్నీషియన్ నవీన్ నూలి ఎడిటింగ్ హ్యాండిల్ చేస్తున్నారు. బిజీ ప్రొడక్షన్ డిజైనర్లలో ఒకరైన అవినాష్ కొల్లా ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్ కాగా శీతల్ శర్మ కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.