బొమ్మరిల్లు రీ రిలీజ్‌.. ఎప్పుడంటే?

Siddharth and Genelia's Bommarillu Ready For Re-release

టాలీవుడ్‌లో ప్రస్తుతం రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోంది. గతంలో సూపర్ హిట్ అయిన సినిమాలకు లేటెస్ట్ టెక్నాలజీ జోడించి సరికొత్తగా మళ్ళీ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్. ఇది నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. అయితే సాధారణంగా స్టార్ హీరోల చిత్రాలనే రీ రిలీజ్‌ చేస్తుంటారు. కానీ ఇప్పుడు ఓ స్టోరీ ఓరియెంటెడ్ మూవీ రీ రిలీజ్‌కి సిద్ధమవుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అదే చిన్న సినిమాగా విడుదలై బ్లాక్ బస్టర్ అయిన ‘బొమ్మరిల్లు’ చిత్రం. సిద్ధార్థ్, జెనీలియా జంటగా నటించిన ఈ మూవీ కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. కథతో పాటు నటీనటుల పెర్ఫార్మెన్స్, చార్ట్ బస్టర్ మ్యూజిక్ ఆల్బమ్, ఎమోషనల్ క్లైమాక్స్.. ఇలా ప్రతిదీ ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్లో నిలబెట్టాయి. ఫ్యామిలీ ఆడియెన్స్‌ను థియేటర్లకు రప్పించిన ఈ సూపర్ హిట్ ఫిల్మ్ మళ్లీ విడుదలకు సిద్ధమైంది.

కాగా బొమ్మరిల్లు చిత్రాన్ని టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌ రాజు నిర్మించారు. 2006 ఆగస్టు 9న విడుదలైన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. తాజాగా ఈ సినిమాను మళ్ళీ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌ రీ రిలీజ్‌ చేయనుండటం గమనార్హం. సెప్టెంబర్ 21న బొమ్మరిల్లు థియేటర్లలోకి వస్తోంది. సో మూవీ లవర్స్.. మరోసారి ఈ లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను వీక్షించేందుకు గెట్ రెడీ.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.