నవ దళపతి సుధీర్ బాబు హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘మా నాన్న సూపర్ హీరో’. ‘లూజర్’ సిరీస్ ఫేమ్ అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వి.సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై, CAM ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
టైటిల్ పోస్టర్ తోనే సినిమాపై ఆసక్తిని పెంచిన ఈ యూనిక్ ఎమోషనల్ సాగాలో సుధీర్ బాబు సరసన ఆర్ణ హీరోయిన్‍గా నటిస్తుండగా.. సాయి చంద్, సాయాజీ షిండే, రాజు సుందరం, శశాంక్, ఆమని, అన్నీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దసరా పండుగ సందర్భంగా మా నాన్న సూపర్ హీరో విడుదల కానుంది. దీంతో మేకర్స్ మూవీ ప్రమోషన్స్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. దీనిలో భాగంగా గురువారం మా నాన్న సూపర్ హీరో టీజర్ రిలీజ్ చేశారు.
ముందుగా ప్రకటించినట్టు ఈరోజు సాయంత్రం RK సినీప్లెక్స్ లోని స్క్రీన్ నెంబర్ 2లో టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. నేచురల్ స్టార్ నాని చేతులమీదుగా ఈ టీజర్ విడుదల చేయడం విశేషం. కాగా ఈ టీజర్ గమనిస్తే.. మా నాన్న సూపర్ హీరో మూవీ ప్రేమ, అనుబంధానికి నిజమైన అర్థాన్ని తెలుసుకుంటూ సోల్‌ని కదిలించే జర్నీని ప్రారంభించిన ఫాదర్ అండ్ సన్ డ్రామాగా తెరకెక్కినట్టు అర్ధమవుతోంది. మొత్తానికి టీజర్ అయితే సినిమాపై అంచనాలను పెంచేసింది.
ఇక ఈ సినిమాకి MVS భరద్వాజ్, శ్రవణ్ మాదాల, అభిలాష్ రెడ్డి కంకర కో రైటర్స్ కాగా.. రాజు సుందరం మాస్టర్ కొరియోగ్రాఫీతో పాటు కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే సమీర్ కళ్యాణి సినిమాటోగ్రాఫర్ కాగా, జై క్రిష్ మ్యూజిక్ డైరెక్టర్‌గా, అనిల్ కుమార్. పి ఎడిటర్‌గా, ఝాన్సీ గోజాల ప్రొడక్షన్ డిజైనర్‌గా, మహేశ్వర్ రెడ్డి గోజాల క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























