ఐదేళ్ల క్రితం వచ్చిన మత్తువదలరాకు సీక్వెల్ గా వస్తున్న సినిమా మత్తువదలరా 2.రేపు థియేటర్లలోకి రానుంది.పార్ట్ 1 రిజల్ట్ పక్కన పడితే ఇందులో సత్య కామెడీ ఆకట్టుకుంది.ఇక ఇప్పుడు సీక్వెల్ వస్తుంది.ఇందులో కూడా మరోసారి కామెడీ కీలకం కానుంది.టీజర్,ట్రైలర్ కు యూట్యూబ్ లో మిలియన్లకు పైగా వ్యూస్ రావడం అలాగే ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేయడంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా అటు ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద సూపర్ గా స్టార్ట్ చేసింది.నార్త్ అమెరికా లో ప్రీమియర్స్ సేల్స్ 50k డాలర్ దాటాయి.స్టార్ కాస్ట్ లేకుండా వస్తున్న సినిమాకు ఈ రేంజ్ బుకింగ్స్ చిన్న విషయం కాదు. హిట్ టాక్ వస్తే హాఫ్ మిలియన్ మార్క్ చేరడం పెద్ద కష్టమేమి కాకపోవచ్చు.
ఇందులో శ్రీ సింహ,కమెడియన్ సత్య,ఫారియా అబ్దులా లీడ్ రోల్స్ లో నటించగా రితేశ్ రానా డైరెక్ట్ చేశాడు.సునీల్,వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కాలభైరవ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టైన్మెంట్ నిర్మించాయి.మరి మంచి అంచనాల మధ్య వస్తున్న ఈసినిమా ఏ మేరకు ఎంటర్టైన్ చేస్తుందో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: