టాలీవుడ్లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ గీత రచయిత గురుచరణ్ కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ గురువారం తెల్లవారుఝామున తుదిశ్వాస విడిచారు. కాగా గురుచరణ్ దిగ్గజ గీత రచయిత ఆచార్య ఆత్రేయ దగ్గర శిష్యరికం చేయడం గమనార్హం. గురుచరణ్ సినీ కెరీర్లో రెండు వందలకు పైగా పాటలు రాసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ముఖ్యంగా సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు హీరోగా చేసే సమయంలో అనేక చిత్రాల్లో గురుచరణ్‌తో ఎన్నో పాటలను రాయించుకున్నారు. ఆయన రాసిన ఎన్నో విషాద గీతాలు ఎవర్ గ్రీన్‌గా నిలిచిపోయాయి. గురుచరణ్ రచించిన వాటిలో ‘ముద్దబంతి పువ్వులో మూగబాసలు’, ‘కుంతీకుమారి తన కాలుజారి’, ‘బోయవాని వేటుకు గాయపడిన కోయిలా’ వంటి సూపర్ హిట్ పాటలున్నాయి.
కాగా గురుచరణ్ సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. ఆయన తల్లిదండ్రులు ఇరువురూ చిత్ర పరిశ్రమకు చెందినవారే. అలనాటి ప్రముఖ నటి ఎం.ఆర్.తిలకం, దివంగత దర్శకుడు మానాపురం అప్పారావు దంపతుల కుమారుడే ఈ గురుచరణ్. ఆయన అసలు పేరు మానాపురపు రాజేంద్రప్రసాద్. ఎం.ఏ వరకు చదివిన ఆయన సినిమాలపై ఆసక్తితో తనకు పట్టున్న సాహిత్యం ఎంచుకుని ఆ రంగంలో రాణించారు. ఇక ఈ సీనియర్ గీత రచయిత మృతిపై టాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































