టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘మట్కా’. పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ మూవీకి ‘పలాస 1978’ ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇంకా నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి రవి శంకర్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే విడుదల చేసిన మట్కా స్పెషల్ గ్లింప్స్ మరియు ఇతర ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ అందుకుంది.చిత్రీకరణ దశలో ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ తుదిదశకు చేరుకుంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుంచి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ అందింది.
ప్రస్తుతం మట్కా ఫైనల్ షెడ్యూల్‌లో ఉంది. రామోజీ ఫిలిం సిటీలో కొనసాగుతున్న ఈ షెడ్యూల్‌లో పలు కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. ఇక ఈ షెడ్యూల్‌తో సినిమా షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తవనుంది. మట్కా 1958 నుండి 1982 వరకు 24 సంవత్సరాల కాలానికి సంబంధించిన కథ అని, యవ్వనం నుండి వృద్ధాప్యం వరకు తన పాత్రకు తగ్గట్టు వరుణ్ తేజ్ నాలుగు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించనున్నాడని సమాచారం.
మట్కా కోసం మేకర్స్ ఇప్పటికే 1980 బ్యాక్‌డ్రాప్ వైజాగ్ లొకేషన్స్ డిజైన్ చేయడం విశేషం. ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా, ఎ కిషోర్ కుమార్ సినిమాటోగ్రఫీ, కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటింగ్ అందిస్తున్నారు. కాగా మట్కా మూవీని వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల మరియు రజనీ తాళ్లూరి భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: