గత ఏడాది సార్,విరూపాక్షలతో బ్లాక్ బాస్టర్ హిట్లు కొట్టిన యంగ్ హీరోయిన్ సంయుక్త మీనన్ ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస ఆఫర్ల తో ఫుల్ బిజీ గా వుంది.అందులో భాగంగా యంగ్ హీరో నిఖిల్ భారీ ప్రాజెక్ట్ స్వయంభులో సంయుక్త ఓ హీరోయిన్ గా నటిస్తుండగా శర్వానంద్ 37లో శర్వా కి జోడిగా నటిస్తుంది.ఈరోజు తన బర్త్ డే కావడంతో ఈసినిమా నుండి సంయుక్త ఫస్ట్ లుక్ విడుదలచేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇవే కాకుండా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 12లో సంయుక్త ను హీరోయిన్ గా తీసుకున్నారు.ఈరోజు తన ఫస్ట్ లుక్ ను విడుదలచేసి విషెస్ తెలిపింది టీం.ఈసినిమాలో తను,సమీరా పాత్రలో కనిపించనుంది.బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ లోనే హై బడ్జెట్,అత్యుత్తమ సాంకేతిక విలువలతో మ్యాసీవ్ స్కేల్ లో ఈ సినిమా రూపొందుతోంది.ఇందులో శ్రీనివాస్ కొత్తగా కనిపించనునున్నాడు.
400 ఏళ్ల నాటి గుడి నేపధ్యంలో కల్ట్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ చిత్రానికి డెబ్యూటెంట్ లుధీర్ బైరెడ్డి దర్శకత్వం వహిస్తుండగా లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నాడు. మూన్ షైన్ పిక్చర్స్పై మహేష్ చందు నిర్మిస్తున్నారు.వచ్చే ఏడాది ప్రథమార్ధంలో విడుదలచేసేలా సన్నాహాలు చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























