ది గోట్ ఫస్ట్ డే హిందీ కలెక్షన్స్

The Greatest Of All Time 1st Day hindi Collections

తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ది గోట్ ( ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం ) నిన్న భారీ అంచనాల మధ్య విడుదలై పాజిటివ్ రివ్యూస్ ను తెచ్చుకుంది.దాంతో మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది.ఈసినిమా తమిళ్ తోపాటు తెలుగు, హిందీలో కూడా విడుదలకాగా తమిళనాడులో దాదాపు 30 కోట్ల ఓపెనింగ్స్ ను అందుకుంది. నార్త్ లో అయితే హిందీ వెర్షన్ 2.10కోట్ల వసూళ్లను సొంతం చేసుకుంది దాంతో అక్కడ అత్యధిక ఓపెనింగ్స్ ను రాబట్టిన 5వ తమిళ సినిమా గా రికార్డు సృష్టించింది.ఈజాబితాలో రోబో 2.0 (20.25)కోట్ల తో మొదటి స్థానంలో ఉండగా కబాలి(5.21కోట్లు) లియో( 2.85కోట్లు ),పిఎస్ 2 (2.18కోట్లు) తరువాతి స్థానాల్లో వున్నాయి.ఇక ది గోట్ అన్ని వెర్షన్ లు కలిపి మొదటి రోజు నార్త్ లో 3.40కోట్ల వసూళ్లను సొంతం చేసుకున్నాయి.అక్కడ ఈసినిమా ను జీ స్టూడియోస్ రిలీజ్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఓవర్సీస్ లో తొలి రోజు ఈసినిమా సూపర్ వసూళ్లను సొంతం చేసుకుంది.ప్రీమియర్స్ తో కలుపుకుని మొదటి రోజు యుఎస్ఏ లో 1మిలియన్ డాలర్ మార్క్ ను దాటగా యు కె లో 4కోట్ల ఓపెనింగ్ ను సొంతం చేసుకుంది.ఓవరాల్ గా ది గోట్ అన్ని భాషల్లో కలిపి మొదటి రోజు 126.32కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.విజయ్ ఈ ఫీట్ సాధించడం వరుసగా ఇది రెండో సారి.అయితే బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా భారీగా ఉండడంతో రానున్న రోజుల్లో ది గోట్ ఇదే రన్ ను కొనసాగించాల్సి ఉంటుంది.ఈరోజు కూడా తమిళనాడులో బుకింగ్స్ అయితే బాగానే వున్నాయి.

వెంకట్ ప్రభు తెరకెక్కించిన ఈసినిమాలో విజయ్ డ్యూయెల్ రోల్ లో నటించగా స్నేహ,మీనాక్షి చౌదరి,ప్రశాంత్,ప్రభుదేవా,అజ్మల్, లైలా,మీనాక్షి చౌదరీ,యోగిబాబు,వీటీవీ గణేష్,జయరామ్ కీలక పాత్రలు పోషించారు.యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు.400కోట్ల బడ్జెట్ తో ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్ ఈసినిమాను నిర్మించింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.