యూఎస్‌ఏ ప్రీమియర్స్ ప్రీ-సేల్స్‌లో దేవర దూకుడు

Devara Collects $500K Plus Premieres Pre-Sales in USA

యంగ్ టైగర్ ఎన్టీఆర్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం విడుదలకు ముందే ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నాల‌ను సృష్టిస్తోంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ క‌థానాయిక‌గా న‌టిస్తుండగా.. మ‌రో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ప్ర‌కాష్ రాజ్‌, శ్రీకాంత్‌, షైన్ టామ్ చాకో, న‌రైన్ తదితరులు ఇత‌ర పాత్ర‌ల్లో కనిపించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ సూపర్ రెస్పాన్స్ అందుకుంటోంది. ఫస్ట్ సింగిల్ ‘ఫియర్ సాంగ్’ మరియు సెకండ్ సింగిల్ ‘చుట్టమల్లె..’ యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఇదే ఊపులో రీసెంట్‌గా రిలీజైన థర్డ్ సింగిల్ ‘దావుదీ’ కూడా మ్యూజిక్ లవర్స్‌ను బాగా అట్రాక్ట్ చేస్తోంది. దీనికితోడు దేవరలో తారక్ డ్యూయెల్ రోల్ చేస్తున్నట్టు మేకర్స్ ఈమధ్యే ప్రకటించడంతో అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.

ఇక ఈ నెల 27న తారక్ ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా దేవర నుంచి మరో కీలక అప్‌డేట్ అందింది. ఈ మూవీ ప్రీమియర్స్‌ను ఒకరోజు ముందుగా, అంటే.. సెప్టెంబర్ 26న అమెరికా (యూఎస్‌ఏ)లో ప్రదర్శించనున్నారు. ఈ క్రమంలో ఇందుకు సంబంధించి ఇప్పటికే మేకర్స్ ప్రీ-సేల్స్‌ను ప్రారంభించగా.. ఇప్పటివరకూ 500K ప్లస్ డాలర్లు వసూలు చేసింది. కాగా దేవరను యూఎస్‌ఏలో ‘ప్రత్యంగిర సినిమాస్’ రిలీజ్ చేయనుంది.

ఇక ఈ మూవీ కోసం టాప్ టెక్నిషియన్స్ పనిచేస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ర‌విచందర్ సంగీత సార‌థ్యం వహిస్తున్నాడు. శ్రీకర్ ప్ర‌సాద్ ఎడిట‌ర్‌గా, ఆర్‌. ర‌త్న‌వేలు సినిమాటోగ్రాఫ‌ర్‌గా, సాబు సిరిల్ ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. కాగా దేవర వరల్డ్‌వైడ్ డిస్టిబ్యూషన్ రైట్స్ ‘హంసిని ఎంటర్‌టైన్‌మెంట్’ సంస్థ దక్కించుకుంది. ఇప్పటికే సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్న క్రమంలో దేవరను హంసిని ఎంటర్‌టైన్‌మెంట్ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనుండటం ఆసక్తి కలిగిస్తోంది.

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో భారీ అంచ‌నాల‌తో ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ‌సుధ ఆర్ట్స్ ప‌తాకాల‌పై మిక్కిలినేని సుధాక‌ర్‌, హ‌రికృష్ణ‌.కె సినిమాను అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మిస్తున్నారు. కాగా హై యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెరకెక్కుతోన్న ‘దేవర’ను రెండు భాగాలుగా రూపొందిస్తుండగా.. ‘దేవర: పార్ట్ 1’ను తెలుగు, త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ‌, మ‌లయాళ భాష‌ల్లో సెప్టెంబ‌ర్ 27న వ‌ర‌ల్డ్ వైడ్ భారీ ఎత్తున రిలీజ్ చేయ‌నున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.