ఈ సినిమా త్వరలోనే 100 కోట్ల కలెక్ట్ చేయబోతోంది

Saripodhaa Sanivaaram Will Collect Rs.100 Cr, Says Producer Dil Raju

నేచురల్ స్టార్ నాని, క్రియేటివ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబోలో వచ్చిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘సరిపోదా శనివారం’. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా, SJ సూర్య పవర్‌ఫుల్ రోల్‌లో నటించిన ఈ చిత్రాన్ని డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్‌, భారీ కాన్వాస్‌తో నిర్మించారు. ఇక ఆగస్ట్ 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదలైన విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఫస్ట్ షో నుంచే అద్భుతమైన రెస్పాన్స్ అందుకున్న ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని, హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా టీమ్ సక్సెస్ మీట్‌ నిర్వహించింది. నిర్మాత దిల్ రాజు, దర్శకులు హను రాఘవపూడి, శివ నిర్వాణ, రాహుల్ సంకృత్యాన్ ప్రత్యేక అతిధులుగా హాజరయ్యారు. చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్న ఈ విజయ వేడుక చాలా ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ దిల్ రాజు మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. ముందుగా ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా కంగ్రాట్స్. ఈ సినిమాకి గూస్ బంప్స్ మ్యూజిక్ ఇచ్చిన జేక్స్ కి కంగ్రాట్స్. వివేక్ లో మాస్ స్టయిలీ లీష్ యాక్షన్ ని నాని ద్వారా చూపించాడు. ఇంత రైన్స్ లో కూడా సినిమా డొమస్టిక్ గా 40 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. తొందరలోనే వరల్డ్ వైడ్ 100 కోట్ల కలెక్ట్ చేయబోతోంది. తొలి సినిమానే వందకోట్లు కలెక్ట్ చేస్తున్న నిర్మాతగా నిలవనున్న కళ్యాణ్ గారికి కంగ్రాట్స్” అని తెలిపారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. “తెలుగులో 16 ఏళ్ళుగా ఇన్ని వేరియేషన్స్ ఇస్తున్న ఏకైక హీరో నాని. తను చాలా హార్డ్ వర్క్ చేసే హీరో. నేను లోకల్ నుంచి మా అసోషియేషన్ వుంది. సినిమా అంటే తనకి భయం భక్తి ప్రేమ. అదే తన సక్సెస్. సూర్య గారు ప్రతినాయకుడి పాత్రలో అద్భుతంగా నటించారు. రేపు గేమ్ ఛేంజర్ లో కూడా ఇలానే వుంటారు. గేమ్ ఛేంజర్ లో ఆయన గురించి కూడా పేపర్లు పడతాయి. ప్రియాంక చాలా క్యూట్ గా చేసింది. ఈ సినిమాని తెలుగు స్టేట్స్ లో రిలీజ్ చేయడానికి ఇచ్చిన దానయ్య గారికి థాంక్ యూ. ఈ ఎనర్జీతో గేమ్ ఛేంజర్ కి పని చేస్తాం” అని అన్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.