నేచురల్ స్టార్ నాని, క్రియేటివ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబోలో వచ్చిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘సరిపోదా శనివారం’. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా, SJ సూర్య పవర్‌ఫుల్ రోల్‌లో నటించిన ఈ చిత్రాన్ని డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్, భారీ కాన్వాస్‌తో నిర్మించారు. ఇక ఆగస్ట్ 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదలైన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఫస్ట్ షో నుంచే అద్భుతమైన రెస్పాన్స్ అందుకున్న ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని, హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా టీమ్ సక్సెస్ మీట్ నిర్వహించింది. నిర్మాత దిల్ రాజు, దర్శకులు హను రాఘవపూడి, శివ నిర్వాణ, రాహుల్ సంకృత్యాన్ ప్రత్యేక అతిధులుగా హాజరయ్యారు. చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్న ఈ విజయ వేడుక చాలా ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా నటుడు ఎస్‌జే సూర్య మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. ఎంతో ప్రేమించి మీ గుండెల్లో చోటిచ్చిన ఆడియన్స్ కి థాంక్స్ చెప్పడానికి ఈ వేడుకకు వచ్చాను. నిజానికి ఈ రోజు నాకు షూట్ వుంది. యూనిట్ కుదరదని చెప్పారు. అయితే ఈ రోజు అందరూ సెలవు తీసుకోండి ఖర్చు నేను భరిస్తాని చెప్పి వచ్చాను. నన్ను తెలుగు ప్రేక్షకుల్లోకి తీసుకెళ్ళిన నా డైరెక్టర్ వివేక్ ఆత్రేయకి ధన్యవాదాలు. సరిపోదా శనివారం ఒక మంచి మూవీ. వివేక్ గారు ఆంధ్ర క్వెంటిన్ జెరోమ్ టరాన్టినో. తను జీనియస్. ప్రతిది బ్రిలియంట్ గా తీశారు. తన రైటింగ్ కి హాట్సాఫ్” అని పేర్కొన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “ప్రియంక హాలీవుడ్ యాక్టర్ లా చేశారు. నాని గారిలో ఒక అమితాబ్ బచ్చన్‌ని చూశాను. తను చెప్పిన ఒక్క డైలాగ్ ‘అడుగు’లో 16 ఏళ్ల అనుభవం కనిపించింది. నిర్మాత కళ్యాణ్ గారికి కంగ్రాట్స్. జేక్స్ బిజోయ్ బ్రిలియంట్ బీజీఎం ఇచ్చారు. నా గొంతులో వచ్చిన తెలుగులో జనాలు ఫీల్ అవ్వాలని సొంత గా డబ్బింగ్ చెప్పాను. జనాలు ఇచ్చిన ప్రేమకి అందరినీ హాగ్ చేసుకోవాలని వుంది. శనివారం వినాయక చవితి వస్తోంది. సెకండ్ వీక్ కూడా సినిమా అదిరిపోవాలి. టీం అందరికీ థాంక్ యూ. ప్రేక్షకుల ప్రేమకు థాంక్ యూ సో మచ్’ అని అన్నారు ఎస్‌జే సూర్య.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
































