నేచురల్ స్టార్ నాని, క్రియేటివ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబోలో వచ్చిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘సరిపోదా శనివారం’. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా, SJ సూర్య పవర్‌ఫుల్ రోల్‌లో నటించిన ఈ చిత్రాన్ని డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్, భారీ కాన్వాస్‌తో నిర్మించారు. ఇక ఆగస్ట్ 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదలైన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఫస్ట్ షో నుంచే అద్భుతమైన రెస్పాన్స్ అందుకున్న ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని, హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా టీమ్ సక్సెస్ మీట్ నిర్వహించింది. నిర్మాత దిల్ రాజు, దర్శకులు హను రాఘవపూడి, శివ నిర్వాణ, రాహుల్ సంకృత్యాన్ ప్రత్యేక అతిధులుగా హాజరయ్యారు. చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్న ఈ విజయ వేడుక చాలా ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా హీరోయిన్ ప్రియాంక మోహన్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. ఈ సినిమా అవకాశం ఇచ్చిన డివివి ఎంటర్‌టైన్‌మెంట్. థాంక్ యూ వివేక్. చారు పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఎస్జే సూర్య గారి నుంచి చాలా నేర్చుకున్నారు. జేక్స్ సినిమాని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళారు. నాని నా ఫేవరట్. ఇండస్ట్రీలో 16 ఏళ్ళు పూర్తి చేసుకున్నందుకు అభినందనలు. ఆయనతో రెండు సినిమాలకి పని చేయడం ఆనందంగా వుంది. ఈ సినిమాకి పని చేసిన అందరికీ థాంక్ యూ. ఇంత వర్షంలో కూడా సినిమానికి ఇంత గొప్ప సపోర్ట్ ఇచ్చినా ఆడియన్స్ కి థాంక్ యూ” అని అన్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: