100 కోట్ల క్లబ్‌ లోకి తంగలాన్

Thangalaan Crosses 100 Cr Plus Gross Around The Globe

కోలీవుడ్ స్టార్ హీరో, చియాన్ విక్రమ్ ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘తంగలాన్’. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన పెద్ద సినిమాలలో ఇది ఒకటి. భారీ నిర్మాణ విలువలు, విక్రమ్ అద్భుత నటనతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించింది. దర్శకుడు పా రంజిత్ మరోసారి వెండితెరపై మాయాజాలం చేశాడు. భారీ అంచనాల నడుమ ఈ నెల 15న థియేటర్స్‌ లోకి వచ్చిన ఈ పీరియాడిక్ యాక్షన్ మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అన్ని సెంటర్స్ నుంచి సక్సెస్‌ఫుల్‌ టాక్‌తో పాటు మంచి కలెక్షన్స్ రాబడుతోంది. మొదటి వారంతో చూస్తే రెండో వారంలో తంగలాన్ సినిమాకు తెలంగాణ, ఏపీలో అదనంగా 141 థియేటర్స్ పెరిగడం గమనార్హం. ఒక్క నైజాం ఏరియాలోనే 90 థియేటర్స్ అదనంగా కేటాయించారు. తెలుగు స్ట్రైట్ సినిమాలతో పాటు విడుదలైన తంగలాన్ గట్టి పోటీని తట్టుకుని బాక్సాఫీస్ వద్ద బలంగా నిలబడింది.

కొత్త మూవీస్ రిలీజ్ అవుతున్నా తంగలాన్ సినిమా సెకండ్ వీక్‌లో సైతం తమిళనాడు, ఏపీ, తెలంగాణ అంతటా స్ట్రాంగ్ హోల్డ్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. చియాన్ విక్రమ్ కెరీర్‌లో 26 కోట్ల రూపాయల బిగ్గెస్ట్ ఓపెనింగ్ డే కలెక్షన్స్ అందుకుని రికార్డ్ సృష్టించింది. ఈ నేపథ్యంలో తాజాగా తంగలాన్ మరో రికార్డ్ చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఈ మేరకు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు.

కాగా తంగలాన్ చిత్రాన్ని నీలమ్ ప్రొడక్షన్స్‌తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించారు. పశుపతి, హరికృష్ణన్, అన్భుదురై తదితరులు కీలక పాత్రలు పోషించారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామా కథతో మ్యాజికల్ రియలిజం స్క్రీన్‌ప్లేతో తెరకెక్కిన తంగలాన్ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తోంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.