నవ దళపతి సుధీర్ బాబు యూనిక్ ఎమోషనల్ సాగా ‘మా నాన్న సూపర్ హీరో’తో అలరించడానికి సిద్ధమౌతున్నారు. లూజర్ సిరీస్ ఫేమ్ అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వి.సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై, CAM ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘మా నాన్న సూపర్ హీరో’ మూవీ ప్రేమ, అనుబంధానికి నిజమైన అర్థాన్ని తెలుసుకుంటూ సోల్‌ని కదిలించే జర్నీని ప్రారంభించిన ఫాదర్ అండ్ సన్ డ్రామా. టైటిల్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. సుధీర్ బాబు సరసన ఆర్ణ హీరోయిన్‍గా నటిస్తున్న ఈ మూవీలో సాయి చంద్, సాయాజీ షిండే, రాజు సుందరం, శశాంక్, ఆమని, అన్నీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా ఈ మూవీ విడుదలకు సంబంధించి కీలక అప్‌డేట్ ఇచ్చారు. కాగా తెలుగునాట కొత్త సినిమాల విడుదలకు సంక్రాంతి తర్వాత దసరా బెస్ట్ సీజన్. ఫ్యామిలీస్‌ని ఎక్కువగా ఎట్రాక్ట్ చేసే కంటెంట్ వున్న ‘మా నాన్న సూపర్ హీరో’ రిలీజ్‌కి దసరా పర్ఫెక్ట్ టైమ్ అని మేకర్స్ భావిస్తున్నారు. దీంతో దసరా పండుగ సందర్భంగా మా నాన్న సూపర్ హీరో విడుదల కానున్నట్టు తెలిపారు. త్వరలోనే ఎగ్జాక్ట్ రిలీజ్ డేట్‌ని రివిల్ చేయనున్నారు.
ఇక ఈ సినిమాకి MVS భరద్వాజ్, శ్రవణ్ మాదాల, అభిలాష్ రెడ్డి కంకర కో రైటర్స్ కాగా.. రాజు సుందరం మాస్టర్ కొరియోగ్రాఫీతో పాటు కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే సమీర్ కళ్యాణి సినిమాటోగ్రాఫర్ కాగా, జై క్రిష్ మ్యూజిక్ డైరెక్టర్‌గా, అనిల్ కుమార్. పి ఎడిటర్‌గా, ఝాన్సీ గోజాల ప్రొడక్షన్ డిజైనర్‌గా, మహేశ్వర్ రెడ్డి గోజాల క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. రిలీజ్ కి సమయం దగ్గర పడటంతో మేకర్స్ ప్రమోషన్స్‌ని త్వరలోనే ప్రారంభించనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























