పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్‌పై బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సి చేసిన వివాదాస్పద కామెంట్స్‌పై కల్కి 2898 AD డైరెక్టర్ నాగ్ అశ్విన్ స్పందించారు. ప్రభాస్ హీరోగా, ఆయన దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘కల్కి 2898 AD’ సంచలన విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇక ఇటీవలే ఈ చిత్రం ఓటీటీ లోకి కూడా వచ్చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఈ చిత్రంలో ప్రభాస్ ఆహార్యం మరియు నటనపై అర్షద్ వార్సి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలపై పలువురు టాలీవుడ్ హీరోలు స్పందిస్తున్నారు. రీసెంట్గా ‘మా’ అధ్యక్షుడు విష్ణు మంచు కూడా ఓ లేఖ విడుదల చేసి నిరసనను తెలియజేసారు. ఈ క్రమంలోనే తాజాగా నాగ్ అశ్విన్ స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆయన స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు.
“ఇలాంటి డిస్కషన్ పెట్టి ఇంకా వెనక్కు వెళ్లొద్దు. నార్త్ – సౌత్ (లేదా) బాలీవుడ్ – టాలీవుడ్ అంటూ లేవు. అంతా కలిపి ఇది ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. మన దృష్టి అంతా పెద్ద సినిమాలు తీయడం పైనే ఉండాలి. అర్షద్ వార్సి తన మాటలను బాగానే ఎంచుకున్నాడు. అయినా సరే. ఆయన పిల్లలకు కల్కి సినిమాలోని బుజ్జి టాయ్స్ పంపుతాను. నేను కష్టపడి పని చేస్తున్నాను. కల్కి2లో ప్రభాస్ బెస్ట్ అని ఫస్ట్ షోలోనే నిరుపిస్తాను” అని అందులో పేర్కొన్నారు నాగ్ అశ్విన్.
కాగా కల్కిలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే హీరోయిన్గా నటించగా.. ఇండియన్ లెజెండరీ యాక్టర్స్ అమితాబ్ బచ్చన్ మరియు కమల్ హాసన్ కీలక పాత్రల్లో కనిపించారు. అలాగే దిశాపటానీ, మాళవిక నాయర్, బెంగాలీ నటుడు స్వాస్థ్ ఛటర్జీ, రాజేంద్రప్రసాద్, పశుపతి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.
వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైన విషయం తెలిసిందే. ఫ్యూచరిస్టిక్ ఎపిక్ మైథలాజికల్ డ్రామాగా తెరకెక్కిన కల్కి భారీ అంచనాల నడుమ విడుదలై గ్లోబల్ వైడ్‌గా బాక్సాఫీస్ వద్ద రూ.1,100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్‌ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























