మలయాళ ముద్దుగుమ్మ నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్‌లో నటించిన న్యూ ఏజ్ క్లీన్ ఎంటర్‌టైనర్ ’35-చిన్న కథ కాదు’. క్లీన్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి నంద కిషోర్ ఈమని రచన, దర్శకత్వం వహిస్తున్నాడు. సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్ వాల్టెయిర్ ప్రొడక్షన్స్ పతాకాలపై రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మిస్తున్నారు. గ్రామీణ నేపధ్యంలో రుప్పొందిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, పాటలు, ఇతర ప్రోమోలు సహా ప్రమోషనల్ కంటెంట్‌కు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో సినిమా ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో 35 నుంచి కీలక అప్‌డేట్ వచ్చింది. తాజాగా మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో 35-చిన్న కథ కాదు సెప్టెంబరు 6న విడుదల చేస్తున్నట్టు తెలిపారు. కాగా ఇది తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
దీంతో మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలను మరింత ముమ్మరం చేస్తున్నారు. దీనిలో భాగంగా ఈ సినిమాని ఎంపిక చేసిన కొద్దిమందికి ప్రదర్శించగా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ చిత్రానికి నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీని అందిస్తుండగా.. విజువల్ అప్పీల్‌ని యాడ్ చేస్తూ ప్రొడక్షన్ డిజైన్‌ను లతా నాయుడు, ఎడిటింగ్ టిసి ప్రసన్న నిర్వహిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: