బ్యాక్ టు బ్యాక్ హిట్ల తరువాత హ్యాట్రిక్ కొట్టడానికి సరిపోదా శనివారంతో వస్తున్నాడు న్యాచురల్ స్టార్ నాని.మరో 5రోజుల్లో ఈసినిమా థియేటర్లలోకి రానుంది. ప్రస్తుతం నాని అన్నీ తానై సినిమాను తెగ ప్రమోట్ చేస్తున్నాడు.ఇక ఈసినిమా బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి.దాదాపు అన్ని ఏరియాల్లో బుకింగ్స్ అందుబాటులోకి వచ్చాయి.అటు నార్త్ అమెరికా లో అడ్వాన్స్ సేల్స్ 150k దాటాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ రోజు ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరుగనుంది.యాక్షన్ ఎంటర్టైనర్ గా వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో వస్తున్న ఈసినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించగా ఎస్ జె సూర్య విలన్ గా చేశాడు.జేక్స్ బిజోయ్ సంగీతం అందించాడు.డివివి ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించింది.నాని అయితే ఈసినిమా విజయం పై ఫుల్ కాన్ఫిడెంట్ గా వున్నాడు.సోలో రిలీజ్ కూడా అడ్వాంటేజ్ కానుంది.దాంతో కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ పై కన్నేశాడు నాని.అయితే రన్ టైం కూడా ఎక్కువగానే వుంది.2గంటల 50నిమిషాల నిడివితో సరిపోదా శనివారం థియేటర్లలోకి రానుంది.
ఇక ఈసినిమా తరువాత నాని,హిట్ 2 సీక్వెల్ ను మొదలు పెట్టె అవకాశాలు వున్నాయి.త్వరలోనే ఈసినిమా గురించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది. ఈసినిమాతోపాటు నాని,దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో మరో సినిమా చేయాల్సివుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























