దేవర సెకండ్ సింగిల్.. యూట్యూబ్‌లో సెన్సేషన్

Devara Second Single Trending No.1 on YouTube For Past 2 Weeks with 110 Million Plus Views,Telugu Filmnagar,Latest Telugu Songs 2024,Telugu Film News 2024,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Jr NTR,Jr NTR Movies,Jr NTR New Movie,Jr NTR Latest Movie,Jr NTR Songs,Jr NTR Devara,Jr NTR Devara Movie Second Single,Devara Second Single,Devara,Devara Movie,Devara Telugu Movie,Devara Movie Updates,Devara Movie Latest News,Devara Update,Devara Latest Update,Devara Songs,Devara Movie Songs,Devara Telugu Songs,Devara Telugu Movie Songs,Devara Song Update,Devara Second Single Update,Devara Second Single Trending No 1 on YouTube,110M For Devara Second Single,Chuttamalle,Chuttamalle Song,Chuttamalle Video Song,Chuttamalle Lyrical Song,NTR,Janhvi Kapoor,Anirudh Ravichander,Shilpa Rao,Saif Ali Khan,Koratala Siva,NTR 30,Devara Second Single 110 Million Plus Views

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం విడుదలకు ముందే ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నాల‌ను సృష్టిస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ క‌థానాయిక‌గా న‌టిస్తుండగా.. మ‌రో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. రీసెంట్‌గా మేకర్స్ ‘దేవర’ నుంచి మ్యూజిక‌ల్ ప్ర‌మోష‌న్స్‌ను స్టార్ట్ చేశారు. అందులో భాగంగా ఇప్ప‌టికే విడుద‌లైన ‘ఫియర్ సాంగ్’ సెన్సేషన్ క్రియేట్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అలాగే ఆ తర్వాత ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విడుదలైన 19 గంటల్లోనే అన్ని భాషల్లో కలిపి 25 మిలియన్ వ్యూస్ అందుకోవడంతోపాటు నాటినుంచి నేటివరకూ దేవర సెకండ్ సింగిల్ యూట్యూబ్‌లో 110 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. దీంతో ప్రస్తుతం యూట్యూబ్‌లో టాప్ 1 ప్లేసులో ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. ఈ మేరకు దేవర మేకర్స్ సోషల్ మీడియాలో ప్రకటించారు.

ఇక ‘చుట్టమల్లె..’ అంటూ సాగే ఈ రొమాంటిక్ సాంగ్‌, అందులోని విజువ‌ల్స్‌ ఫ్యాన్స్‌కి, ప్రేక్ష‌కుల‌కు పెద్ద ట్రీట్‌లా ఉంది. హీరోపై త‌న‌కున్న ప్రేమ‌ను హీరోయిన్ తెలియజేయడమే ఈ సాంగ్‌ ముఖ్య ఉద్దేశం. ఇక ఈ పాట‌ను రామ‌జోగ‌య్య శాస్త్రి అద్భుతంగా రాశారు. ఎన్టీఆర్ స్టైలిష్ లుక్‌లో క‌నిపిస్తున్నారు. జాన్వీ క‌పూర్ అందం వావ్ అనిపిస్తోంది. ఇద్ద‌రి జోడీ, మ్యూజిక్‌కి త‌గిన‌ట్లు వారు వేసిన డాన్స్ మూమెంట్స్‌తో ఇంట‌ర్నెట్‌లో పాట వైర‌ల్ అవుతోంది.

ఎన్టీఆర్‌, జాన్వీ జంట పాట‌లో రొమాంటిక్‌గా క‌నిపించ‌టం అభిమానుల‌కు క‌నువిందుగా ఉంది. ఇద్ద‌రి మ‌ధ్య కెమిస్ట్రీ అద్భుతంగా ఉంది. బీచ్ తీరంలో ఎన్టీఆర్ డాన్స్‌, జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ అవ‌తార్‌లో క‌నిపిస్తూ, వినసొంపుగా ఉన్న పాట మ‌న‌సును హ‌త్తుకుంటోంది. బాస్కో మార్టిస్ కొరియోగ్ర‌ఫీ చూడ‌టానికి సింపుల్‌గా క‌నిపిస్తూనే క‌ళ్లు తిప్పుకోనీయ‌ట్లేదు.

మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ర‌విచందర్ సంగీత సార‌థ్యంలో ‘చుట్టమల్లె..’ పాట ఈ ఏడాది బెస్ట్ మెలోడీ సాంగ్‌గా ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌నుంది. స్టార్ సింగర్ శిల్పా రావ్ పాట‌ను ఎంతో శ్రావ్యంగా పాడారు. ఈ కాంబోతో పాట నెక్ట్స్ లెవ‌ల్‌కు చేరింది. రేపు థియేటర్లలో ఇది క‌చ్చితంగా అభిమానుల‌కు, సినీ ప్రేక్ష‌కుల‌కు ఓ స‌రికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇవ్వ‌నుంది.

ఇక ఈ మూవీ కోసం స్టార్ యాక్టర్స్ అండ్ టాప్ టెక్నిషియన్స్ పనిచేస్తున్నారు. ప్ర‌కాష్ రాజ్‌, శ్రీకాంత్‌, షైన్ టామ్ చాకో, న‌రైన్ తదితరులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. శ్రీకర్ ప్ర‌సాద్ ఎడిట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్న ఈ చిత్రానికి ఆర్‌. ర‌త్న‌వేలు సినిమాటోగ్రాఫ‌ర్‌, సాబు సిరిల్ ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో భారీ అంచ‌నాల‌తో ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ‌సుధ ఆర్ట్స్ ప‌తాకాల‌పై మిక్కిలినేని సుధాక‌ర్‌, హ‌రికృష్ణ‌.కె సినిమాను అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మిస్తున్నారు. కాగా హై యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెరకెక్కుతోన్న ‘దేవర’ను రెండు భాగాలుగా రూపొందిస్తుండగా.. ‘దేవర: పార్ట్ 1’ను తెలుగు, త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ‌, మ‌లయాళ భాష‌ల్లో సెప్టెంబ‌ర్ 27న వ‌ర‌ల్డ్ వైడ్ భారీ ఎత్తున రిలీజ్ చేయ‌నున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.