‘బాహుబలి’ సినిమాతో తొలిసారిగా బాలీవుడ్లో అడుగుపెట్టాడు పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్. బాహుబలి ముందువరకూ సౌత్ సినిమాలంటే ఒకరకమైన చిన్న చూపు చూసే హిందీ జనాలకి ఈ సినిమా తర్వాత ఆ ధోరణి మారింది. అప్పటినించీ ప్రభాస్ నటించిన ప్రతి సినిమా అక్కడ స్టార్ హీరోలకు సమానంగా, ఒక్కోసారి అంతకుమించి అన్నట్టుగా బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపే కలెక్షన్స్‌తో సత్తా చాటుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దీంతో అక్కడి హీరోలలో కొందరికి ప్రభాస్ అంటే ఒకవిధమైన జెలస్ ఉన్నట్టు కనిపిస్తోంది. ప్రభాస్ సినిమా రిలీజైన ప్రతి సందర్భంలో హిందీ చిత్ర పరిశ్రమకు చెందిన ఎవరో ఒకరు ఎదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేయడాన్ని గమనించే వుంటారు. అయితే స్టార్ హీరోలు ఇందుకు అతీతం. వారు ఎప్పుడూ ప్రభాస్‌పై నోరు జారలేదు. అయితే తాజాగా ప్రముఖ నటుడు అర్షద్ వార్సీ ప్రభాస్‌పై కొన్ని కామెంట్స్ చేశారు.
ఇటీవల ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న వార్సీ మాట్లాడుతూ.. ‘నేను కల్కి సినిమా చూశాను. నాకు అస్సలు నచ్చలేదు. ఇందులో ప్రభాస్ లుక్ ఏం బాలేదు, జోకర్ లా ఉన్నాడు. తనను అలా చూసి బాధేసింది. ఈ సినిమాలో ప్రభాస్‌ను ‘మ్యాడ్ మ్యాక్స్ రేంజ్’లో ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఆ రేంజ్లో సినిమాను తెరకెక్కించడంలో దర్శక నిర్మాతలు ఫెయిలయ్యారు” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇక అర్షద్ వార్సీ వ్యాఖ్యలపై ప్రభాస్ అభిమానుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.
ఈ నేపథ్యంలో దీనిపై టాలీవుడ్ హీరో సుధీర్ బాబు స్పందించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన అర్షద్ వార్సీ వ్యాఖ్యలను ఖండించారు. “నిర్మాణాత్మకంగా విమర్శించడం వరకు ఫర్వాలేదు, కానీ కావాలని విమర్శించడం అనేది ఆమోదయోగ్యం కాదు. అర్షద్ వార్సీ వంటి నటుడి నుండి ఇలాంటి ప్రొఫెషనలిజం లేని వ్యాఖ్యలను ఎప్పుడూ ఊహించలేదు. తక్కువ స్థాయి గల వ్యక్తుల నుంచి వచ్చే వ్యాఖ్యల కన్నా ప్రభాస్ స్థాయి చాలా పెద్దది” అని అందులో పేర్కొన్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























