భలే ఉన్నాడే ట్రైలర్ రిలీజ్

Bhale Unnade trailer out now

43రోజుల వ్యవధిలో మూడో సినిమాతో వస్తున్నాడు యంగ్ హీరో రాజ్ తరుణ్.గత నెలలో పురుషోత్తముడు తో అలాగే ఈనెల స్టార్టింగ్ లో  తిరగబడరసామీ అనే సినిమాలు వచ్చాయి.అయితే ఈరెండు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.ఇవి ఇంకా ఓటిటిల్లోకి కూడా రాలేదు అప్పుడే మరో సినిమాను దింపుతున్నాడు రాజ్ తరుణ్. అదే భలే ఉన్నాడే! ప్రముఖ డైరెక్టర్ మారుతి ప్రొడక్ట్ గా వస్తుంది దాంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. 

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈరోజు ట్రైలర్ ను కూడా వదిలారు.మారుతి గత చిత్రాలు ఈరోజుల్లో ,బస్ స్టాప్ లో లాగ భలే ఉన్నాడే !ఎంటర్టైన్మెంట్ తో వస్తుంది.హీరోకి ఓ సమస్య ఉండడం వల్ల  అమ్మాయిలకు దూరంగా ఉంటాడు అయితే  హీరోయిన్ అతన్ని లవ్ చేయడం ఆ తరువాత అది కాస్త పెళ్ళికి దారితీయడంతో హీరో  జీవితం ఎలా టర్న్ అయ్యింది అనే కథ తో వస్తుంది ఈసినిమా.ఓవరాల్ గా ట్రైలర్ అయితే ప్రామిసింగ్ గా అనిపించింది.మరి ఈసినిమా అయినా రాజ్ తరుణ్ కు హిట్ ఇస్తుందో చూడాలి. 

శివ సాయి వర్ధన్ డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాలో మనీషా కందుకూర్ హీరోయిన్ గా నటిస్తుండగా వీటీవీ గణేష్ ,గోపరాజు రమణ కీలక పాత్రలు పోషిస్తున్నారు.శేఖర్ చంద్ర సంగీతం అందిస్తుండగా కిరణ్ కుమార్ నిర్మిస్తున్నాడు.సెప్టెంబర్ 7న ఈసినిమా థియేటర్లోకి రానుంది. 

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.