బాలనటుడిగా పలు సినిమాల్లో నటించిన ఆకాష్ పూరీ మెహబూబా సినిమాతో హీరోగా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఆ తరువాత రొమాంటిక్, చోర్ బజార్.. సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఏ సినిమా కూడా మంచి హిట్ ను అందించలేకపోయాయి. ప్రస్తుతం అయి ఆకాష్ పూరీ పలు సినిమాలను లైన్ లో పెట్టినట్టు తెలుస్తుంది. దీనిలో భాగంగానే నేడు తన కొత్త సినిమా అప్ డేట్ వచ్చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాశీ పరశురామ్ దర్శకత్వంలో ఆకాష్ జగన్నాథ్ హీరోగా వస్తున్న సినిమా తల్వార్. యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈసినిమా ఈ రోజు హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈసినిమా ప్రారంభోత్సవంలో పలువురు టాలీవుడ్ ప్రముఖులు అతిథిలుగా పాల్గొన్నారు. ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ నివ్వగా, హీరో కార్తికేయ స్క్రిప్ట్ హ్యాండోవర్ చేశారు. డైరెక్టర్ బాబీ కెమెరా స్విచ్ఛాన్ చేయగా, డైరెక్టర్ బుచ్చిబాబు సాన ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనుంది.
కాగా ఈసినిమాను వార్నిక్ స్టూడియోస్ బ్యానర్ పై భాస్కర్ ఇ.ఎల్.వి నిర్మిస్తున్నారు. సినిమాటోగ్రఫీ త్రిలోక్ సిద్ధు, సంగీతం కేశవ కిరణ్ అందిస్తున్నారు. ఈ చిత్రంలో భారీ తారాగణం నటించబోతున్నారు. వారి వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























