టాలీవుడ్ స్టార్ హీరో, పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ ‘బాహుబలి’ తర్వాత దేశవ్యాప్తంగా పాపులర్ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వచ్చిన సినిమాలతో వరల్డ్ వైడ్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఇటీవలే ‘కల్కి 28987 AD’ చిత్రంతో రూ.1,000 కోట్లకు పైగా బాక్సాఫీస్ కలెక్షన్స్ సాధించి ఔరా అనిపించాడు. ఈ నేపథ్యంలో ప్రభాస్ క్రేజ్ అంతకంతకూ పెరిగిపోతోంది. డార్లింగ్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ఎంతోమంది ఆయన నటనకు ఫిదా అవుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ క్రమంలో తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ప్రభాస్ నటనపై ప్రశంసల వర్షం కురిపించారు. హాలీవుడ్‌తో పోటీపడే స్థాయికి ప్రభాస్ ఎదిగారని, ఇది తెలుగువారిగా మనందరికీ గొప్ప గర్వకారణమని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి. ఈ మేరకు ఆయన తాజాగా హైదారాబాద్‌లో క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అభినందన సభ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. “క్షత్రియ సామాజికవర్గం నుంచి సినీ రంగంలో ఉన్నతస్థాయి ఎదిగిన వ్యక్తుల్లో కృష్ణంరాజు ఒకరు. ఆయన పేరు లేకుండా తెలుగు సినిమా పేరు చెప్పలేమన్నారు. ప్రస్తుతం కృష్ణంరాజు గారు సజీవంగా మన మధ్య లేకపోయినా ఆయన నటన ఎప్పటికీ ప్రజల్లో గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. కృష్ణంరాజు నాతో మాట్లాడేటప్పుడు అనేక విషయాలను పంచుకునేవారు” అని తెలిపారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “సినిమాలలో కృష్ణంరాజు గారి వారసత్వాన్ని వారి అబ్బాయి ప్రభాస్ కొనసాగిస్తున్నారు. ప్రభాస్ లేకుండా ‘బాహుబలి’ సినిమాని ఊహించలేం. ప్రభాస్ టాలీవుడ్, బాలీవుడ్‌ను మించి ప్రస్తుతం హాలీవుడ్‌తో పోటీపడే స్థాయికి చేరుకున్నారు. దీని వెనుక ఎంతో శ్రమ దాగి ఉంది. నేటి యువత ప్రభాస్ వంటి వ్యక్తులను ఆదర్శంగా తీసుకుని తాము ఎంచుకున్న రంగాల్లో ఉన్నత శిఖరాలకు ఎదగాలి. పట్టుదల, శ్రమ, నిబద్ధత ఉంటే అనుకున్న లక్ష్యాలను వేగంగా సాధించగలం” అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాగా సీఎం వ్యాఖ్యలపై డార్లింగ్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























