బ్రహ్మానందం నుండి బ్రహ్మీ ఫస్ట్ లుక్ రిలీజ్

Brahmanandam First Look Out From Brahma Anandam Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2024,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Brahma Anandam First Look,Raja Goutham,Brahmanandam,Brahma Anandam First Look out on August 16th,Brahma Anandam First Look Poster,Brahma Anandam,Brahma Anandam Movie,Brahma Anandam Telugu Movie,Brahma Anandam Movie Updates,Brahma Anandam Movie Latest News,Brahma Anandam First Look Update,Brahma Anandam Glimpse,Brahma Anandam Movie Glimpse,Brahma Anandam Glimpse Update,Brahmanandam Movies,Brahmanandam New Movie,Brahmanandam Latest Movie,Brahmanandam Brahma Anandam Movie First Look,Brahmanandam Brahma Anandam Movie,Brahmanandam First Look From Brahma Anandam,Brahma Anandam Movie First Look Out,Brahma Anandam 1st Look,Brahma Anandam Glimpse on August 19th

హాస్య బ్రహ్మ బ్రహ్మానందం ఈవయసులో కూడా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. అయితే ఇప్పుడు సెలక్టివ్ సినిమాల్లో మాత్రమే నటిస్తున్నారు. ఆ మధ్య రంగమార్తండ సినిమాలో సీరియస్ పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నాడు. ఇక ఇప్పుడు మరో సినిమాతో వస్తున్నాడు. కొడుకు రాజా గౌతమ్ ప్రధాన పాత్రల్లో ఈసినిమా వస్తుంది. బ్రహ్మనందం అనే టైటిల్ తోనే ఈసినిమా రాబోతుంది. ఈసినిమాలో బ్రహ్మానందం కూడా కీలకపాత్రల్లో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈసినిమా ప్రీ లుక్ పోస్టర్, ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్ మెంట్ వీడియోను రిలీజ్ చేయగా అవి ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం అయితే షూటింగ్ ను పూర్తిచేసుకునే పనిలో ఉన్నారు చిత్రయూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు చాలా రోజుల తరువాత ఈసినిమా నుండి ఒక అప్ డేట్ తో వచ్చారు. తాజాగా బ్రహ్మీకి సంబంధించి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. అంతేకాదు ఈసినిమా నుండి గ్లింప్స్ ను కూడా రిలజ్ చేయబోతున్నట్టు తెలిపారు. ఈనేపథ్యంలోనే డేట్ ను కూడా ఫిక్స్ చేసి ప్రకటించారు. ఆగష్ట్ 19వ తేదీన 12 గంటల 34 నిమిషాలకు గ్లింప్స్ ను రిలీజ్ చేస్తున్నారు.

కాగా ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాలో ప్రియ వడ్లమాని, ఐశ్వర్య హీరోయిన్లుగా నటిస్తుండగా.. వెన్నెల కిషోర్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. శాండిల్య పిసపాటి సంగీతం అందిస్తుండగా.. మితేష్ పర్వతనేని సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నారు. ప్రసన్న ఈసినిమాకు ఎడిటర్. స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రాహుల్ యాదవ్ నక్కా నిర్మిస్తున్నారు. సావిత్రి, శ్రీ ఉమేష్ యాదవ్ సమర్పిస్తున్నారు. అంతేాకాదు ఈఏడాది డిసెంబర్ 6వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు కూడా ప్రకటించారు..

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.