కమల్ హాసన్, లెజెండరీ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఇండియన్2. బ్లాక్ బస్టర్ కాంబినేషన్ కాబట్టి ఈసినిమా పై మొదటినుండీ భారీ అంచనాల ఏర్పడ్డాయి. అలా ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా జులై 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈసినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియ భవాని శంకర్ ఫీమేల్ లీడ్ లో నటించగా.. సిద్ధార్ధ్, సముద్రఖని ముఖ్య పాత్రలలో నటించారు. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జియాంట్ మూవీస్ పై ఉదయనిధి స్టాలిన్, సుభాస్కరన్ నిర్మించిన ఈసినిమాకు.. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా ఓటీటీ రిలీజ్ పై ఇప్పటికే పలు వార్తలు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈసినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకున్నారు. అయితే స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేయనున్నారని పలు కథనాలు కూడా వచ్చాయి. ఇప్పుడు తాజాగా మరో అప్ డేట్ బయటకు వచ్చింది. భారీతీయుడు 2 ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ఆగష్ట్ 9వ తేదీన ఈసినిమాను తమిళ్, తెలుగు తోపాటు పలు భాషల్లో రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. మరి దీనిపై క్లారిటీ రావాలంటే మాత్రం అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ ఆగాల్సిందే. చూద్దాం మరి ఓటీటీలో భారతీయుడు2 ఎలాంటి ఆదరణను సొంతం చేసుకున్నారు.
ప్రస్తుతం కమల్ హాసన్ నుండి రిలీజ్ కు సిద్దమవుతున్న సినిమా థగ్ లైఫ్. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో రాబోతున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఈసినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా..మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, జయం రవి, నాజర్, అభిరామి, శింబు, ఐశ్వర్య లక్ష్మీ, గౌతమ్ కార్తీక్, జోజు జార్జ్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్ పై ఉదయనిధి స్టాలిన్ సమర్పణలో రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్ బ్యానర్స్ పై సంయుక్తంగా కమల్, ఆర్ మహేంద్రన్, మణిరత్నం, శివ అనంత్ నిర్మిస్తున్నారు. ఈసినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు. సినిమాటోగ్రాఫర్ గా రవి కె చంద్రన్.. ఎడిటర్ గా శ్రీకర్ ప్రసాద్ పనిచేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























