తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) నూతన అధ్యక్షుడిగా భరత్ భూషణ్ ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో ఆయన TFCCకి కొత్త ప్రెసిడెంట్‌గా ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో భరత్ భూషణ్ తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారిని కలిశారు. గురువారం మర్యాదపూర్వకంగా కలుసుకున్న ఆయన సీఎం రేవంత్ రెడ్డికి పుష్పగుచ్చం అందించి తెలుగు సినీ ఇండస్ట్రీ సమస్యలు మరియు గద్దర్ అవార్డ్స్ గురించి చర్చించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు భరత్ భూషణ్ గారు మాట్లాడుతూ.. “ఎంతో బిజీ షెడ్యూల్ ఉండి కూడా కలవడానికి అవకాశం ఇచ్చి ముచ్చటించినందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇండస్ట్రీలో ఉన్న సమస్యల్ని పరిష్కరించడంలో ప్రభుత్వం నుంచి ఎప్పుడూ సహాయం అందుతుందని ఆయన చెప్పడం చాలా ఆనందంగా ఉంది” అని తెలిపారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ.. “తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు భరత్ భూషణ్ గారికి అభినందనలు. నా అమెరికా పర్యటన తర్వాత తెలుగు సినీ ఇండస్ట్రీలో మీటింగ్ ఏర్పాటు చేసి తెలంగాణ ప్రభుత్వం తరఫు నుంచి ఎలాంటి సపోర్ట్ కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉన్నాం” అని హామీ ఇచ్చారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























