టాలీవుడ్లో గత కొంతకాలంగా రీ-రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోన్న విషయం తెలిసిందే. కొన్ని ప్రత్యేక సందర్భాలను పురస్కరించుకుని మేకర్స్ వాటిని రీ-రిలీజ్ చేస్తున్నారు. ఇక రీ-రిలీజ్‌లకు ప్రేక్షకులు, అభిమానుల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. తాజాగా ఈ లిస్టులోకి సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలు రెండు చేరాయి. ఆయన హీరోగా నటించిన సూపర్ హిట్ ఫిల్మ్స్ ‘ఒక్కడు’ మరియు ‘మురారి’ త్వరలో థియేటర్లలోకి రాబోతున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మహేష్ బాబు జన్మదినం సందర్భంగా ఆగస్టు 9న మురారి రీ రిలీజ్ అవుతుండగా.. అంతకుముందు రోజు ఒక్కడు సినిమా ప్రత్యేకంగా ఎంపిక చేసిన థియేటర్లలోకి వస్తోంది. దీంతో తమ అభిమాన హీరో చిత్రాలు రెండు ఒక్కరోజు వ్యవధిలో థియేటర్లలోకి వస్తుండటంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మురారి మూవీలో హీరోయిన్గా నటించిన స్టార్ నటి సోనాలి బింద్రే నాటి అనుభవాలను పంచుకున్నారు.
ఈ మేరకు ఆమె తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “మురారి రీ-రిలీజ్ కావడం నాకు చాలా ఆనందంగా ఉంది. మా దర్శకుడు కృష్ణ వంశీకి ధన్యవాదాలు. మురారి సెట్స్‌లో చాలా రోజులు గడిపినట్లు నాకు గుర్తుంది. ఆ సినిమాకు సహాయ దర్శకులుగా పనిచేసినవారిలో ఒకరైన నందినీ రెడ్డి నాకు తెలుగు కుటుంబాల సంప్రదాయాలు మరియు ఆచారాల గురించి వివరించేది. సెట్స్‌లో ఆమెతో కలిసి పనిచేయడం నాకు నచ్చింది” అని ‘బేబీ’ దర్శకురాలు నందిని రెడ్డి గురించి చెప్పింది.
ఇంకా ఆమె మాట్లాడుతూ.. ” మురారిలోని అన్ని పాటలు నాకు చాలా ఇష్టం. కానీ, వాటిలో ప్రత్యేకంగా ‘చెప్పమ్మా చెప్పమ్మా’ పాట అంటే బాగా ఇష్టం. ఎందుకంటే అందులో నన్ను చాలా అందంగా చూపించారు. నా షిఫాన్ చీర రంగులు మార్చే విధానం మరియు పాట యొక్క సందర్భం చాలా రొమాంటిక్‌గా ఉంటుంది. అలాగే ‘ఎక్కడ ఎక్కడ ఉందో తారక’ సాంగ్ కూడా నచుతుంది. ఇది సినిమాలోని ప్రధాన పాత్రలను పరిచయం చేస్తుంది. నేను పాటను చాలా ఇష్టపడతాను” అని సోనాలి బింద్రే వివరించారు.
కాగా క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ దర్శకత్వం వహించిన మురారి సినిమా 2001 ఫిబ్రవరి 17న విడుదలైంది. మహేష్ బాబు టైటిల్ రోల్లో నటించగా.. ఆయన సరసన సోనాలి కథానాయికగా కనిపించింది. సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ, గొల్లపూడి, లక్ష్మి, ప్రసాద్ బాబు, రఘుబాబు సహా ఎంతోమంది నటీనటులు ముఖ్య పాత్రలు పోషించారు. రామ్ ప్రసాద్ ఆర్ట్స్ పతాకంపై ఎన్ దేవి ప్రసాద్, రామలింగేశ్వరరావు, గోపి నందిగం నిర్మించిన ఈ చిత్రానికి ‘మెలోడీ బ్రహ్మ’ మణిశర్మ పాటలు, నేపథ్య సంగీతం సమకూర్చారు.
తెలుగునాట నెం.1 డిజిటల్ మీడియాగా వెలుగొందుతోన్న ‘మ్యాంగో మాస్ మీడియా’ మురారి రీ-రిలీజ్‌ను సరికొత్త హంగులతో 4Kలో ప్రేక్షకులకు అందిస్తోంది. అలాగే ఈ సినిమా ద్వారా వచ్చే ఆదాయాన్ని స్వచ్ఛంద సేవలను నిర్వహిస్టోన్న ‘మహేష్ బాబు ఫౌండేషన్’ కు అందించనుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























