మిస్టర్ బచ్చన్ థర్డ్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

ravi teja mr bachchan movie third single release date fixed

మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా మిస్టర్ బచ్చన్. వీరిద్దరి కాంబినేషన్ అంటే ఎక్స్ పెక్టేషన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాను అనౌన్స్ చేసిన దగ్గర నుంచి కూడా డీసెంట్ హైప్ క్రియేట్ చేస్తూనే ఉంది. ఇక ఇప్పటికే విడుదలైన షో రీల్, టీజర్ ట్రెమండస్ రెస్పాన్స్ తో హ్యూజ్ బజ్ క్రియేట్ చేశాయి. అంతేకాదు ఈ సినిమా నుండి ఇప్పటికే రెండు పాటలను కూడా రిలీజ్ చేశారు. సితార ఇంకా రెప్పల్ డప్పుల్ అంటూ పాటలను రిలీజ్ చేయగా రెండు పాటలు కూడా ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో చూశాం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు మూడో పాటను రిలీజ్ చేయడానికి సిద్దమయ్యారు. తాజాగా థర్డ్ సింగిల్ కు సంబంధించిన అప్ డేట్ తో వచ్చారు మేకర్స్. జిక్కీ అంటూ వచ్చే పాటను వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఇక ఈ సందర్భంగా ఒక పోస్టర్ ను రిలీజ్ చేయగా పోస్టరే ఆకట్టుకుంటుంది. మరి ఈ పాట ఎలా ఉంటుందో చూడాలి.

కాగా ఈసినిమాలో ఇంకా జగపతి బాబు, సచిన్ ఖేడేకర్, వైవా హర్ష, నెల్లూరు సుదర్శన్, తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తుండగా, అయనంక బోస్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఈ చిత్రానికి అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ కాగా, ఎడిటింగ్ ఉజ్వల్ కులకర్ణి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.