టాలీవుడ్ మేకర్స్ ఇటీవల ఎక్కువగా యువ నటీ,నటులతో చిత్రాలను రూపొందిస్తున్నారు. ప్రేక్షకులు కూడా కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా యంగ్ అండ్ ట్యాలెంటెడ్ కృష్ణ వంశీ, మోక్ష లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ‘అలనాటి రామచంద్రుడు’. లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు చిలుకూరి ఆకాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హైనివా క్రియేషన్స బ్యానర్‌పై హైమావతి, శ్రీరామ్ జడపోలు నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్‌కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో మూవీపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక అలనాటి రామచంద్రుడు ఆగస్ట్ 2న విడుదల కానుంది. ఈ నేపధ్యంలో హీరోయిన్ మోక్ష విలేకరుల సమావేశంలో మూవీ విశేషాలని పంచుకున్నారు.
మీ నేపధ్యం గురించి?
నేను బెంగాలీ అమ్మాయిని. కోల్‌కాతా నుంచి వచ్చాను. తెలుగులో నా మొదటి సినిమా ‘లక్కీ లక్ష్మణ్’. అలనాటి రామచంద్రుడు నా రెండో సినిమా. గత రెండేళ్ళుగా తెలుగు మలయాళం తమిళ పరిశ్రమల్లో పని చేస్తున్నాను. తెలుగు అర్ధం అవుతుంది. మాట్లాడటం కూడా చాలా వరకూ వచ్చింది. అలనాటి రామచంద్రుడు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.
అలనాటి రామచంద్రుడు లో మీ పాత్ర ఎలా వుండబోతుంది?
ఇందులో నా క్యారెక్టర్ పేరు ధరణి. ఇదొక కమర్షియల్ పోయిటిక్ మూవీ. ట్రైలర్ చూస్తే బ్యూటీఫుల్ పోయిట్రీ వుంటుంది. నా క్యారెక్టర్ చాలా హైపర్, అల్లరిగా వుంటుంది, దర్శకుడు ఏం చెప్పారో అదే అద్భుతంగా ప్రజెంట్ చేశారు. చాలా బ్యూటీఫుల్ క్యారెక్టరైజేషన్, ప్రతి అమ్మాయి రిలేట్ చేసుకునేలా వుంటుంది. ఈ సినిమాలో నాకు చాలా మంచి డైలాగులు వున్నాయి.
అలనాటి రామచంద్రుడులో మీకు చాలెంజింగ్ గా అనిపించిన అంశం ఏమిటి?
ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశాం. సెకండ్ హాఫ్ కంప్లీట్‌గా మనాలిలో వుంటుంది. షూటింగ్‍లో చాలా ఛాలెంజ్స్ ఎదురుకున్నాం. వింటర్‌లో మైనస్ డిగ్రీలలో షూటింగ్ చేశాం. ఈ కథలో నేచర్ ఒక ఫీలాసఫీగా వుంటుంది, ఆ నేచర్ క్యాప్చర్ చేయడం సవాల్‌గా అనిపించింది.
హీరో కృష్ణ వంశీ గారితో వర్క్ ఎక్స్ పీరియన్స్ ఎలా వుంది?
కృష్ణ వంశీ ఇందులో తన క్యారెక్టర్‌కి పర్ఫెక్ట్‌గా ఫిట్ అయ్యారు. తన పెర్ఫర్మెన్స్ చాలా నేచురల్‌గా వుంటుంది.
డైరెక్టర్ ఆకాష్ రెడ్డి గురించి?
దర్శకుడు ఈ కథ చెప్పినప్పుడు ఈ పాత్ర నా కోసమే పుట్టిందేమో అనిపించింది. నా ఆడిషన్ ఆయనకి నచ్చింది. దిని కోసం వర్క్ షాప్ కూడా చేశాం. డైరెక్టర్ గారు చాలా మంచి విజన్‌తో అద్భుతంగా ఈ సినిమా చేశారు. చాలా హానెస్ట్‌గా కష్టపడి తీసిన సినిమా ఇది.
అలనాటి రామచంద్రుడు టైటిల్ గురించి?
ఇందులో హీరో క్యారెక్టర్‌కి పర్ఫెక్ట్‌గా సరిపోయే టైటిల్ ఇది. ఇందులో తనది స్వార్ధం లేని ప్రేమ. ప్రజెంట్ జనరేషన్‌లో శ్రీరాముని క్యారెక్టర్‌తో హీరో క్యారెక్టర్‌ని కోరిలేట్ చేసుకునేలా వుంటుంది. ఇదొక క్లాసిక్ యూనివర్సల్ లవ్ స్టొరీ.
ప్రొడక్షన్ హౌస్ గురించి?
మనాలి, అమలాపురం, వైజాగ్ ఇలా డిఫరెంట్ లోకేషన్స్‌లో సినిమాని షూట్ చేశాం, నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా కథకు కావాల్సిన ప్రతిదీ సమకూర్చారు. ఒక పెద్ద సినిమాలానే చేశారు. వారికి హ్యాట్సాఫ్ చెప్పాలి. చాలా విజనరీ ప్రొడ్యూసర్స్.
మ్యూజిక్ గురించి?
అలనాటి రామచంద్రుడు మ్యూజిక్ అద్భుతంగా వుంటుంది. నేపధ్యం సంగీతం అన్‌బిలివబుల్ అనిపిస్తుంది. సరికొత్త మ్యూజిక్‌ని ఆడియన్స్ ఎక్స్ పీరియన్స్ చేస్తారు.
తెలుగు సినిమాలు చూస్తుంటారా? మీ ఫేవరేట్ హీరో ఎవరు?
చాలా తెలుగు సినిమాలు చూశాను. సావిత్రి గారు చేసిన ‘దేవదాస్’ నుంచి అనుష్క గారి ‘అరుంధతి’, లేటెస్ట్ సాయి పల్లవి గారి ‘విరాట పర్వం’ వరకూ ఎన్నో సినిమాలని ఎంజాయ్ చేశాను. సీతారామం, హనుమాన్ ఎంతగానో నచ్చాయి.
నాకు ఇక్కడ అందరూ ఇష్టమే. నాని గారు అంటే ఇష్టం, ఆయన శ్యామ్ సింగరాయ్ బెంగాల్ నేపథ్యంలో వుంటుంది. ఆయనతో వర్క్ చేయాలని వుంది.
తెలుగు సినిమాలు చేయడం చాలా ఆనందంగా వుంది. తెలుగు పాన్ ఇండియా ఇండస్ట్రీ. ఇక్కడ ఆడియన్స్ చాలా లవబుల్‌గా వుంటారు. ప్రమోషన్స్‌లో ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది.
ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలని వుంది?
ఫ్యామిలీ ఆడియన్స్‌కి నచ్చే క్యారెక్టర్స్ చేయాలని వుంది.
నెస్ట్ ప్రాజెక్ట్స్?
రామం రాఘవం సినిమా చేస్తున్నాను. అలాగే ఒక మలయాళం సినిమా విడుదలకు రెడీ అవుతుంది.
ఆల్ ది బెస్ట్..
థాంక్ యూ.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























