కియారా అద్వానీ బర్త్ డే.. గేమ్ ఛేంజర్ నుండి కొత్త పోస్టర్‌ రిలీజ్

Team Game Changer Released New Poster of Kiara Advani on Her Birthday

‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘గేమ్ ఛేంజర్’. పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీకి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. చరణ్ 15వ చిత్రంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో రామ్‌ చ‌ర‌ణ్ డిఫరెంట్ పాత్రలో కనిపించనున్నారు. ఇక ఇప్పటికే గేమ్ ఛేంజర్‌లో తన పాత్రకు సంబంధించి రామ్ చరణ్ షూటింగ్ కంప్లీట్ చేశాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సినిమాలో ఆయన సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోన్న విషయం తెలిసిందే. కాగా రామ్ చరణ్‌తో ఆమెకు ఇది రెండవ సినిమా. అంతకుముందు ‘వినయ విధేయ రామ’ చిత్రంలో ఆయనతో కలిసి నటించింది. ఇక ఇదిలావుంటే, ఈరోజు కియారా పుట్టినరోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా గేమ్ ఛేంజర్ టీమ్ ఆమెకు శుభాకాంక్షలు తెలియజేసింది. అలాగే సోషల్ మీడియా వేదికగా కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. “మా జాబిలమ్మ (అకా) కియారా అద్వానీకి జన్మదిన శుభాకాంక్షలు. ఆమె ప్రకాశవంతమైన శక్తి త్వరలో మీ హృదయాలను మంత్రముగ్ధులను చేస్తుంది” అని అందులో పేర్కొంది.

కాగా గేమ్ ఛేంజర్ సినిమాలో శ్రీకాంత్, ఎస్‌జే సూర్య, జయరామ్, సునీల్‌, అంజలి, నవీన్ చంద్ర తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సోషల్ మెసేజ్‍తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యానర్‌పై టాలీవుడ్ అగ్ర నిర్మాతలు దిల్ రాజు, శిరీష్‌లు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.