పుష్ప 2-పుష్ప పుష్ప సాంగ్ ఖాతాలో 150M

pushpa 2 movie pushpa pushpa song create new record

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా ఎంత క్రేజ్ ను సొంతం చేసుకున్నాడోో తెలిసిందే కదా. దీనికి కారణం పుష్ప సినిమా అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సినిమా పుష్ప. ఈసినిమా సంచలనాలు క్రియేట్ చేసింది. ఇక ఈసినిమాలోని పాటలు ఈసినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సామి సామి, శ్రీ వల్లి సాంగ్, ఊ అంటావా మామ ఊహూ అంటాావా, ఏ బిడ్డ ఇది నా అడ్డ ఇలా ఏపాటకి ఆపాట సోషల్ మీడియాలో సంచలనాలు సృష్టించాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు పుష్ప 2 వంతు వచ్చింది. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను ముగించుకుంటున్నా మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే పాటలను కూడా రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే పుష్ప పుష్ప సాంగ్, సూసేకి అగ్గిరవ్వ మాదిరి పాటలు రిలీజ్ అయ్యాయి. ఈ పాటలు కూడా యూ ట్యూబ్ లో మిలియన్ వ్యూస్ తో దూసుకుపోయాయి. అయితే తాజాగా ఈ సినిమాలోని పుష్ప పుష్ప ఫస్ట్ సాంగ్ కొత్త రికార్డ్ ను క్రియేట్ చేసింది. ఈ పాట యూట్యూబ్‌లో ఏకంగా 150 మిలియన్ వ్యూస్ మార్క్‌ను టచ్ చేసినట్లుగా మేకర్స్ అఫీషియల్‌గా వెల్లడించారు. దీంతో పుష్ప మేనియా దేశవ్యాప్తంగా ఏ రేంజ్‌లో ఉందో అర్థమవుతోంది.

కాగా ఈసినిమా నుండి వచ్చిన ప్రతి అప్ డేట్ రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ దగ్గర నుండి ఈమధ్యే అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా వచ్చిన టీజర్ ను వరకూ అన్నీ రిలీజ్ అయిన కొద్ది నిమిషాల్లోనే సోషల్ మీడియాల్లో దూసుకుపోతున్నాయి. పుష్ప..ది రూల్ కూడా మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. రెండో పార్టులో కూడా కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తుంది. జగపతిబాబు, అనసూయ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలానే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.