సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన యాక్షన్ కింగ్ అర్జున్

Actor Arjun Sarja Meets Telangana CM Revanth Reddy

ప్రముఖ సినీ నటుడు యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. మంగళవారం రాత్రి హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసానికి వెళ్లిన ఆయన ముఖ్యమంత్రిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎంకు పుష్పగుచ్ఛం అందించారు అర్జున్. ఇక తమ గృహానికి వచ్చిన అర్జున్‌ని సీఎం రేవంత్ రెడ్డి సాదరంగా ఆహ్వానించి శాలువాతో సత్కరించారు. కొద్దిసేపు ఇరువురూ పలు విషయాలపై ముచ్చటించుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ప్రముఖ సినీ నటుడు శ్రీ అర్జున్ గారు తనను మర్యాదపూర్వకంగా కలిశారని తెలిపారు. కాగా తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటినుంచీ సినీపరిశ్రమకు చెందిన పలువురు నటులు, నిర్మాతలు, దర్శకులు ఆయనను కలుసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా నటుడు అర్జున్ సర్జా కూడా సీఎంను కలుసుకున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.