టాలీవుడ్ మ్యాచో గోపీచంద్ ప్రస్తుతం ఒక సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నా సరైన హిట్ మాత్రం దక్కడం లేదు. ఈ ఏడాది ఇప్పటికే భీమా సినిమాతో వచ్చాడు కానీ భీమా సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇప్పుడు మరో సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వస్తున్నాడు. శ్రీనువైట్ల దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా వస్తున్న సినిమా విశ్వం. మాస్ యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఒకవైపు షూటింగ్ జరుపుతూనే మరోపక్క ఈసినిమా అప్ డేట్స్ ను ఇస్తూనే ఉన్నారు మేకర్స్. ఇప్పటికే పలు పోస్టర్లు రిలీజ్ చేశారు. అంతేకాదు ఫస్ట్ స్ట్రైక్ పేరుతో ఒక వీడియో ను కూడా రిలీజ్ చేయగా వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈసినిమా నుండి మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ తో వచ్చారు మేకర్స్. ది జర్నీ ఆఫ్ విశ్వం పేరుతో ఒక సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇవ్వనున్నట్టు తెలిపారు. రేపు అంటే జులై 31వ తేదీ ఉదయం 11 గంటల 7 నిమిషాలకు ఈ అప్ డేట్ ఇవ్వనున్నారు.
కాగా ఈసినిమాలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీనువైట్ల ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకు పనిచేసిన గోపీ మోహన్ ఈసినిమాకు స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. చైతన్య భరద్వాజ్ ఈసినిమాకు సంగీతం అందిస్తుండగా.. కేవీ గుహన్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్ పై వేణు దొనెపూడి ఈసినిమాను నిర్మిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































