ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పటినుండో వెయిట్ చేస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా దేవర. ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఇప్పటివరకూ ఎన్టీఆర్ నుండి సినిమా రాలేదు. దీంతో ఎన్టీఆర్ ను వెండితెరపై ఎప్పుడు చూద్దామా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే షూటింగ్ ను పూర్తిచేసే పనిలో ఉన్నారు చిత్రయూనిట్. ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ పూర్తయింది. మరోపక్క చిన్నగా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఇప్పటికే ఫస్ట్ సింగిల్ ఫియర్ సాంగ్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. పవర్ ఫుల్ గా ఉన్న ఈ సాంగ్ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు అందరూ సెకండ్ సాంగ్ గురించి ఈగర్ వెయిట్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా సెకండ్ సాంగ్ పై ఇప్పటికే అప్ డేట్ వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈసినిమా ఆడియో హక్కులను సొంతం చేసుకున్న టీ సిరీస్ వారు సెకండ్ సాంగ్ గురించి హింట్ ఇచ్చారు. అయితే ఈసారి లవ్ సాంగ్ రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు. ఇప్పుడు సెకండ్ సాంగ్ గురించి సరస్వతి పుత్రుడు రామ జోగయ్య శాస్త్రి కూడా తన ట్విట్టర్ ద్వారా ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఇచ్చాడు. తంగం అంతరంగం.. హాయిగా ఉయ్యాలూగుతున్నట్టుంది.. ఇప్పుడే విన్నా.. త్వరలోనే వచ్చేస్తుందిలే.. శుభోదయం అంటూ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. మరి తంగం అనేది జాన్వీ పేరు.. దీంతో ఇంతకు ముందు వచ్చిన అప్ డేట్ ను బట్టి రామ జోగయ్య శాస్త్రి ట్వీట్ ను బట్టి ఈపాట లవ్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ మధ్య వస్తున్నట్టు అర్థమవుతుంది.
కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీకర ప్రసాద్ ఎడిటర్ గా సబు సిరిల్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























