విలక్షణ నటుడు కమల్ హాసన్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది ఇప్పటికే రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ముందుగా కల్కి2898AD సినిమాలో సుప్రీం యాస్కిన్ గా కనిపించి అదరగొట్టాడు. సినిమాలో కనిపించింది తక్కువ సేపే అయినా, ఆ ఇంపాక్ట్ సినిమా మొత్తం ఉంటుంది. రీసెంట్ గా ఇండియన్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రిలీజ్ కు ముందు ఈసినిమాపై ఎన్నో ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే ఆ ఎక్స్ పెక్టేషన్స్ ను రిచ్ కాలేకపోయింది ఈసినిమా. బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు తన కొత్త సినిమాపై ఫోకస్ ను షిప్ట్ చేశాడు కమల్. లెజెండ్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా ఈసినిమా రాబోతుంది. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. దీనిలో భాగంగానే తాజాగా ఈసినిమా నుండి క్రేజీ అప్ డేట్ తో వచ్చారు మేకర్స్. ఈసినిమా డబ్బింగ్ ను మొదలుపెట్టినట్టు తెలిపారు.
ఇక ఈ సినిమాలో కమల్ హాసన్ రంగరాయ శక్తివేల్ నాయకర్ గా నటిస్తున్నారు. ఇప్పటికే సినిమా నుండి కమల్ హాసన్ ఫస్ట్ ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ మంచి రెస్పాన్స్ నే సొంతం చేసుకుంది. ఇక నుండి ఈసినిమాకు సంబంధించి అప్ డేట్లను వరుసగా ఇవ్వనున్నట్టు తెలుస్తుంది.
కాగా ఈసినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా..మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, జయం రవి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా ఐశ్వర్య లక్ష్మీ, గౌతమ్ కార్తీక్, జోజు జార్జ్ కూడా నటిస్తున్నారు. రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్ పై ఉదయనిధి స్టాలిన్ సమర్పణలో రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్ బ్యానర్స్ పై సంయుక్తంగా కమల్, ఆర్ మహేంద్రన్, మణిరత్నం, శివ అనంత్ నిర్మిస్తున్నారు. ఈసినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు. సినిమాటోగ్రాఫర్ గా రవి కె చంద్రన్.. ఎడిటర్ గా శ్రీకర్ ప్రసాద్ పనిచేస్తున్నారు.
మరి వీరిద్దరి కాంబినేషన్ లో ఇంతకు ముందు నాయకుడు సినిమా వచ్చింది. బాంబే బ్యాక్‌డ్రాప్‌లో 1987లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. దాదాపు 3 దశాబ్దాల తరువాత మళ్లీ ఈసినిమాతో వస్తున్నారు. ఈసినిమా ఎలా ఉంటుందో చూడాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























