టాలీవుడ్ టాలెంటెడ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘మెకానిక్ రాకీ’. మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ట్రయాంగిల్ లవ్ డ్రామాగా రూపొందుతుండగా.. మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ విశ్వక్ సరసన కథానాయికలుగా నటిస్తున్నారు. SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్‌ని ఆదివారం లాంచ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ఈవెంట్‌లో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. విశ్వక్ ఏమన్నారో ఆయన మాటల్లోనే.. “అందరికీ బోనాలు పండగ శుభాకాంక్షలు. ఇది జస్ట్ గ్లింప్స్ మాత్రమే. ఈ ఏడాది చాలా స్పెషల్. మూడో సినిమా కూడా రాబోతోంది. మెకానిక్ రాకీ అవుట్ పుట్ ఇంత గ్రాండ్ గా రావడానికి కారణం నిర్మాత రామ్ తాళ్లూరి గారు. ఆయన లేకపోతే ఇంత పాజిబుల్ అయ్యేది కాదు. రవితేజ చాలా ట్యాలెంటెడ్. సినిమా మీద పాషన్ తో వచ్చారు. సినిమాని చాలా అద్భుతంగా తీశారు” అని తెలిపాడు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “మనోజ్ ఇండియాలో టాప్ డీవోపీ అవుతాడు. శ్రద్దా శ్రీనాథ్ కెరీర్ లో ఇది బెస్ట్ లుక్ అనిపించింది. మంచి క్యారెక్టర్. ఇది బ్యూటీఫుల్ ట్రైయాంగిల్ లవ్ స్టొరీ. మీనాక్షి వండర్ ఫుల్ కో స్టార్. తనకి గుర్తుండిపోయే క్యారెక్టర్ అవుతుంది. జేక్స్ బిజోయ్ అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు. ప్రతి సాంగ్ బ్లాక్ బస్టర్ అయ్యే ఆల్బం ఇచ్చాడు. చాలా న్యూ ఏజ్ మ్యూజిక్ ఇచ్చాడు. ఇది గ్లింప్స్ మాత్రమే. ముందుముందు చాలా రాబోతున్నాయి” అని పేర్కొన్నారు.
అలాగే సినిమా నేపథ్యం గురించే చెబుతూ.. “మలక్ పేట్ బ్యాక్ డ్రాప్ వుండే కథ ఇది. నా క్యారెక్టర్ చాలా కనెక్టింగ్ వుంటుంది. చాలా మంచి కామెడీ టైమింగ్ వుంటుంది. మెకానిక్ రాకీ రొమాంటిక్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్. మెట్రో మాస్ అనుకోవచ్చు. చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా ఎంటర్ టైన్ చేస్తుంది. ఇది దీవాళి క్రాకర్ అవుతుంది. అందరూ ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయండి. అందరికీ థాంక్ యూ” అని అన్నారు హీరో విశ్వక్ సేన్.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























