నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ మేకర్ శేఖర్ కమ్ముల, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున క్రేజీ కాంబినేషన్‌లో మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ కుబేర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మేకర్స్ డిఫరెంట్ పోస్టర్లు , గ్లింప్స్ ద్వారా సినిమాలోని ప్రధాన పాత్రలను పరిచయం చేశారు. కాగా ఆదివారం ధనుష్ పుట్టినరోజు. శేఖర్ కమ్ముల టీం ధనుష్ పుట్టినరోజును అద్భుతమైన పోస్టర్ తో సెలబ్రేట్ చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ పోస్టర్ చాలా ఇంట్రస్టింగ్ గా వుంది. ఇదివరకూ ఎన్నడూ చేయని క్యారెక్టర్ లో కనిపిస్తున్నారు ధనుష్. ఇందులో ధనుష్ పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవల్ లో వుండబోతోంది. అద్భుతమైన స్టార్ కాస్ట్, టాప్ నాచ్ టెక్నికల్ టీంతో శేఖర్ కమ్ముల కుబేరు హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేస్తోంది. హై బడ్జెట్ సోషల్ డ్రామా రూపొందుతున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా, జిమ్ సర్భ్ కీలక పాత్రలో కనిపించనున్నారు.
శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌పై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్న కుబేర తమిళం, తెలుగు, హిందీ భాషల్లో మల్టీలాంగ్వేజ్ ప్రాజెక్ట్‌గా రూపొందుతోంది. ఇక శేఖర్ కమ్ముల తన నెక్స్ట్ సినిమాను కూడా ఇదే బ్యానర్ లో చేయనున్నాడు. త్వరలోనే ఆ వివరాలు వెలుబడనున్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























