అల్లరి నరేష్ 63 మూవీ ప్రారంభం

allari naresh 63 movie officially launched

అల్లరి సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆ తరువాత వరుసగా కామెడీ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నాడు అల్లరి నరేష్. ఇప్పుడు కాస్త తన పంథాను మార్చి విభిన్నమైన పాత్రలు చేస్తున్నాడు. ప్రస్తుతం తను బచ్చలమల్లి అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈసినిమాలో కూడా నరేష్ మల్లి అనే మాసీ పాత్రతో రానున్నాడు. ఇక ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. నరేష్ సరసన అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. హాస్య మూవీస్ బ్యానర్‌ పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మించనున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం.. రిచర్డ్ ఎం నాథన్ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాతో పాటు మరో సినిమాను కూడా నరేష్ లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే కదా. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో అల్లరి నరేష్ ఒక సినిమా చేస్తున్నాడు. నరేష్ కెరీర్ లో వస్తున్న 63వ సినిమా కాగా సితార బ్యానర్ లో వస్తున్న 29వ సినిమా ఇది. అల్లరి నరేష్ పుట్టినరోజు సందర్భంగా జూన్ 30న ఈసినిమాను ఇప్పటికే ప్రకటించారు. ఇప్పుడు తాజాగా పూజా కార్యక్రమాలతో సినిమాను ప్రారంభించారు. వారం రోజుల్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించనున్నారట.

కాగా .ఫ్యామిలీ డ్రామా సినిమాతో ప్రశంసలు అందుకున్న మెహర్ తేజ్ ఈసినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. రుహాని శర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ప్రముఖ స్వరకర్త జిబ్రాన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.