యూఎస్ఏ లో పేక మేడలు గ్రాండ్ రిలీజ్

pekamedalu movie grand release in usa

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్ ఎంపవర్మెంట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈసినిమా జులై 19న విడుదలైంది. అయితే కంటెంట్ ఉంటే ఏ సినిమాని అయినా ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి ఈసినిమా రుజువు చేసింది. చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం సాధించింది. ప్రతి ఒక్కరూ సినిమా చూసే విధంగా ప్రీమియర్స్ ని 50 రూపాయలకే ప్రత్యేక షోలు వేసి పేక మేడలు సినిమా వైపు చూసే లాగా చేశారు. విడుదలైన రోజు నుంచి 100 రూపాయలకే టికెట్ రేట్లు పెట్టి ప్రేక్షకులు థియేటర్లకు వచ్చేలాగా చేశారు ఉమెన్ ఎంపవర్మెంట్ ని బేస్ చేసుకున్న సినిమా కాబట్టి ఆడవారు అందరూ ఈ సినిమా చూసే విధంగా ఈ రేట్లు పెట్టినట్టుగా చెబుతున్నారు టీం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు ఈసినిమాను యూఎస్ఏలో కూడా రిలీజ్ చేయనున్నారు. జులై 26 నుంచి నిర్వాణ మూవీస్ డిస్ట్రిబ్యూషన్ తరఫున యూఎస్ఏ లో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత రాకేష్ వర్రే మాట్లాడుతూ : మొదటి రోజు నుంచి సినిమా ను ఆదరించి ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. టికెట్ రేట్ 100 రూపాయలు పెట్టడం వల్ల ఎక్కువ మంది ప్రేక్షకులు సినిమాని చూడగలిగారు. ఇప్పుడు మా సినిమాని నిర్వాణ మూవీస్ డిస్ట్రిబ్యూషన్ వారు ఈనెల 26 నుంచి యూఎస్ఏ లో రిలీజ్ చేస్తున్నారు. ఇక్కడ ఆదరించినట్టే యూఎస్ఏ లో ఉన్న తెలుగు ప్రేక్షకులు అందరూ ఈ సినిమాను చూసి సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నానని అన్నారు.

కాగా ఈసినిమాలో రితిక శ్రీనివాస్, జగన్ యోగి రాజ్, అనూష నూతల, గణేష్ తిప్పరాజు, నరేన్ యాదవ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ పై రాకేష్ వర్రే నిర్మించిన ఈసినిమాకు మ్యూజిక్: స్మరణ్ సాయి, సినిమాటోగ్రఫీ: హరిచరణ్ కె. అందించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.