వెంకట్ ప్రభు దర్శకత్వంలో దళపతి విజయ్ నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా ది గోట్(ది గ్రెేటెస్ట్ ది ఆల్ టైమ్). ఈ ఏడాది రాబోతున్న తమిళ్ సినిమాల్లో రిలీజ్ కాబోతున్న పెద్ద సినిమా అవడంతో ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా నుండి వచ్చిన అప్ డేట్లు అన్నీ సినిమాపై అంచనాలన భారీగా పెంచేశాయి. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ షూటింగ్ ను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించుకుంటుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టి వరుసగా అప్ డేట్లు ఇస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈసినిమా నుండి మరో ఎగ్జైటింగ్ అప్ డేట్ తో వచ్చారు మేకర్స్. ఈసినిమాకు సంబంధించి తన సోషల్ మీడియా ద్వారా ఆసక్తికర అప్‌డేట్ అందించాడు డైరెక్టర్. ఈసినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే మ్యూజీషియన్ తన పనిని స్టార్ట్ చేశాడని చెబుతూ యువన్ శంకర్ రాజా ఫొటోను పోస్ట్ చేశాడు.
కాగా ఈసినిమాలో విజయ్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు. ఈసినిమాలో విజయ్ కు జోడీగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా స్నేహ, ప్రశాంత్, ప్రభుదేవా, జైరాం, లైలా, కమెడియన్, అజ్మల్, యోగిబాబు, వైభవ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై అర్చన కల్పతి నిర్మిస్తున్నారు. యువన్‌శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో సెప్టెంబర్ 5వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























