ఆది సాయికుమార్‌ ష‌ణుఖ్మ‌ నుండి పవర్‌ఫుల్‌ పోస్టర్‌ రిలీజ్

Shanmukha Powerful Poster Released From Aadi Saikumar Devotional Thriller

నవ్యమైన కథకు, ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లేను జోడించి, ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసే డివోషనల్‌ చిత్రాలకు అన్ని భాషల్లో మంచి ఆదరణ వుంటుంది. ఆ నమ్మకంతోనే రూపొందుతున్న పాన్‌ ఇండియా డివోష‌న‌ల్ థ్రిల్ల‌ర్ చిత్రం ‘ష‌ణ్ముఖ’. ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో ఆది సాయికుమార్ క‌థానాయ‌కుడు. అవికా గోర్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి ష‌ణ్ముగం సాప్ప‌ని ద‌ర్శ‌కుడు. శాస‌న‌స‌భ అనే పాన్ ఇండియా చిత్రంతో అంద‌రికి సుప‌రిచిత‌మైన సంస్థ సాప్‌బ్రో ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ త‌మ ద్వితీయ చిత్రంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సాప్ప‌ని బ్ర‌దర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో తుల‌సీరామ్ సాప్ప‌ని, ష‌ణ్ముగం సాప్ప‌ని, ర‌మేష్ యాద‌వ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మణానంతర పనులను జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో పవర్‌ఫుల్‌ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్‌. ఆది సాయికుమార్‌, అవికా గోర్‌ ఉత్కంఠగా నడిచివస్తున్న ఈ పోస్టర్‌ అందరిలోనూ ఆసక్తిని పెంచుతుంది. ఈ చిత్రంలో పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌గా ఆది నటిస్తున్న విషయం తెలిసిందే.

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు ష‌ణ్ముగం సాప్ప‌ని మ‌ట్లాడుతూ.. “ఇదొక డివోషనల్‌ థ్రిల్లర్‌. ప్రతి సన్నివేశంలోనూ ఓ పాజిటివ్‌ వైబ్‌, మ్యాజిక్‌ వుంటుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ ట‌చ్ చేయ‌ని ఓ అద్భుత‌మైన పాయింట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం విజువ‌ల్ వండ‌ర్‌లా, అద్బుత‌మైన గ్రాఫిక్స్‌తో మెస్మరైజ్‌ చేసే విధంగా వుంటుంది డివోషనల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రతి పాత్ర ఎంతో సహజంగా వుంటుంది. అన్ని భాషల్లో ఒకేసారి అక్టోబర్‌లో విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం” అని తెలిపారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. “కేజీఎఫ్‌, స‌లార్ చిత్రాల‌కు త‌న సంగీతంతో ప్రాణం పోసిన ర‌వి బ‌సూర్ ఈ చిత్రానికి స్ట‌నింగ్ మ్యూజిక్‌ను అందిస్తున్నారు. ప్ర‌స్తుతం అత్యున్న‌త సాంకేతిక నిపుణుల‌తో నిర్మాణనంత‌ర ప‌నులు మొద‌లుకానున్నాయి. విజువ‌ల్ ఎఫెక్ట్స్‌, గ్రాఫిక్స్ విష‌యంలో ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకుని, ఓ వండ‌ర్‌ఫుల్ మూవీని ప్రేక్ష‌కుల ముందుకు తీసుక‌రావ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నాం. త‌ప్ప‌కుండా ఈ చిత్రం ఆది కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోతుంది” అని ద‌ర్శ‌కుడు ష‌ణ్ముగం సాప్ప‌ని అన్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.