పుష్ప2- ఎలాంటి ఆలస్యం లేదు

allu sirish clarity on pushpa 2 movie delay

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఫుల్ డీ గ్లామరైజ్డ్ గా రా అండ్ రస్టిక్ మేకోవర్ లో గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన సినిమా పుష్ప. ఈసినిమా దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఇప్పుడు సెకండ్ పార్ట్ వస్తున్న సంగతి తెలిసిందే కదా. మొదటి పార్ట్ సంచలన విజయం వల్ల ఈ పార్ట్ పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఆ అంచనాలను మరింత పెంచేశాయి ఇప్పటివరకూ వచ్చిన అప్ డేట్లు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ముగించుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈసినిమా రిలీజ్ పై ఇప్పటికే పలు అనుమానాలు, కన్ఫ్యూజన్ నెలకొన్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే ఆగష్ట్ 1వ తేదీ నుండి డిసెంబర్ 6వ తేదీకి వాయిదా వేశారు. ఇప్పుడు డిసెంబర్ 6వ తేదీన కూడా రిలీజ్ అవుతుందన్న నమ్మకం లేదన్న వార్తలు తెరపైకి వచ్చాయి. అందులోనూ సుకుమార్-బన్నీ మధ్య విబేధాలు వచ్చాయని.. అందుకే అల్లు అర్జున్ ట్రిప్ కు వెళ్లడం జరిగిందన్న రూమర్లు కూడా వచ్చాయి. కానీ వాటిలో ఎలాంటి నిజం లేదన్న క్లారిటీ వచ్చింది. అంతేకాదు రీసెంట్ గా డిసెంబర్ 6వ తేదీన ఈసినిమా వస్తుందని.. తగ్గేదేలే అంటూ నిర్మాణ సంస్థ క్లారిటీ కూడా ఇచ్చింది. ఇప్పుడు ఈసినిమా రిలీజ్ పై అల్లు శిరీష్ కూడా క్లారిటీ ఇచ్చాడు.

అల్లు శిరీష్ హీరోగా రాబోతున్న సినిమా బడ్డీ. శామ్ ఆంటోన్ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా ఆగష్ట్ 2వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న శిరీష్ పుష్ప2 గురించి మాట్లాడుతూ.. పుష్ప2 సినిమా విషయంలో ఎలాంటి ఆలస్యం లేదు.. చెప్పిన టైమ్ కే ఈసినిమా వస్తుంది అంటూ క్లారిటీ ఇచ్చాడు. మరి శిరీష్ చెప్పినట్టు ఫిక్స్ చేసిన డేట్ కే ఈసినిమా వస్తుందేమో చూద్దాం.

కాగా అల్లు శిరీష్ సరసన ప్రిషా సింగ్ ఫీమేల్ లీడ్ లో నటిస్తుండగా.. తమిళ నటుడు అజ్మల్, అలీ ముఖేష్ రిషీ కూడా ఒక కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా హిప్ హాప్ తమీజా సంగీతం అందిస్తున్నాడు. ఆంటోని రూబెన్ ఎడిటర్ గా, క్రిష్ణన్ వసంత్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. మరి ఈసినిమాతో అయినా అల్లు శిరీష్ మళ్లీ ఫామ్ లోకి వస్తాడేమో చూద్దాం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.