డబుల్ ఇస్మార్ట్ థర్డ్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

ram pothineni double ismart movie third single release date fixed

టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ కూడా ఎప్పటి నుండో మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈమధ్య కాలంలో పలు సినిమాలతో వచ్చినా ఏ సినిమా కూడా విజయాన్ని అందించలేకపోయింది. ఇప్పుడు తన హోప్స్ అన్నీ డబుల్ ఇస్మార్ట్ పైనే ఉన్నాయి. ఈసినిమా పూరీ దర్శకత్వంలో వచ్చి బ్లాక్ బస్టర్ అయిన ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే కదా. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక ఆగష్ట్ 15వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికే ఈసినిమా నుండి రెండు పాటలను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. స్టెప్పా మార్ అనే పాటను, మార్ ముంతా చోడ్ చింతా అంటూ వచ్చే రెండు పాటలను రిలీజ్ చేశారు. మాస్ బీట్ తో ఉన్న రెండు పాటలు కూడా సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా రామ్ అదిరిపోయే స్టెప్పులు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా కనిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు మూడో పాటకు సంబంధించిన అప్ డేట్ తో వచ్చేశారు. క్యా లఫ్డా అంటూ వచ్చే ఈపాటను జులై 29వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు.

కాగా ఈసినిమాలో కావ్యా థాపర్‌ హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమాలో ఇంకా బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇంకా ఈసినిమాలో అలీ, షయాజీ షిండే, గెటప్ శ్రీను, ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ఈసినిమాను పూరి కనెక్ట్స్‌ పై పూరీ జగన్నాథ్, ఛార్మి కలిసి నిర్మించనున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. శ్యామ్ కే నాయుడు, జియాని జియానెలి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.