రాబిన్ హుడ్ రిలీజ్ డేట్ వాయిదా ప్లాన్?

nithiin robinhood makers planning for new release date

టాలీవుడ్ హీరో నితిన్ కు సాలిడ్ హిట్ దక్కి కూడా చాలా రోజులైపోయింది. అయినా కూడా ఎక్కడా తగ్గకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం తను రాబిన్ హుడ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. వెంకీ కుడుముల ఈసినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. నితిన్-వెంకీ కుడుముల కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా ఇది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన భీష్మ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈసినిమా రిలీజ్ పై ఇప్పుడు ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి తెరపైకి వచ్చింది. ఈసినిమా రిలీజ్ డేట్ ను వాయిదా వేస్ ప్లాన్ లో ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. నిజానికి ఈసినిమాను క్రిస్మస్ పండుగ సందర్భంగా డిసెంబర్ 20వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు కూడా. కానీ ఇప్పుడు ఈసినిమాను ఫిబ్రవరిలో ఈసినిమా రిలీజ్ చేయాలని చూస్తున్నారట. జనవరి సంక్రాంతికి పలు సినిమాలు క్యూలో ఉంటాయి కాబట్టి ఫిబ్రవరికి వాయిదా వేయాలని చూస్తున్నారట. డిసెంబర్ కు పలు సినిమాలు క్యూ కడుతుండటంతోనే మేకర్స్ ఈనిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మరి దీనిపై క్లారిటీ రావాలంటే మాత్రం అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వెయిట్ చేయాల్సిందే.

కాగా నట కిరీటి రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీని అందిస్తుండగా, ప్రవీణ్ పూడి ఎడిటర్ గా, రామ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.