తెలుగు సినిమాలకు ఇప్పుడు హిందీలో కూడా మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే కదా. అందుకే మన తెలుగు సినిమాలను హిందీలో రిలీజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంతేకాదు పలు సినిమాలు అక్కడ సాలిడ్ రెస్పాన్స్ ను అందుకోవడమే కాకుండా కలెక్షన్స్ పరంగా కూడా మంచి కలెక్షన్స్ ను అందిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈక్వేషన్స్ మారిపోయాయేమో కానీ నార్త్ లో మన హవా అంతగా లేనప్పుడే ఒక హీరో డబ్బింగ్ సినిమాలు మాత్రం యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ ను రాబట్టుకున్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది సినిమాలు 100మిలియన్ వ్యూస్ ను సాధించడమంటే మాములు విషయం కాదు. మరి ఆ ఘనత సాధించిన హీరో ఎవరో కాదు టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రామ్ నటించిన గణేష్, కందిరీగ, పండగ చేస్కో, నేను శైలజా, ఉన్నది ఒకటే జిందగీ, హలో గురు ప్రేమ కోసమే, హైపర్, ది వారియర్, ఇస్మార్ట్ శంకర్ సినిమాలు 100 మిలియన్స్ పైగా వ్యూస్ రాబట్టి సంచలనం రేపాయి. ఇప్పుడు తాజాగా ఈయన హీరోగా నటించిన స్కంధ మూవీ హిందీ డబ్బింగ్ వెర్షన్ తాజాగా 100 మిలియన్ వ్యూస్ రాబట్టుకుంది. మరి ఆయన నటించిన 10 సినిమాలు యూట్యూబ్ లో 100 మిలియన్స్ పైగా వ్యూస్ రాబటుకోవడం అంటే మాములు విషయం కాదు. దీంతో దక్షిణాది నుంచి ఈ రేంజ్ లో వ్యూస్ రాబట్టిన హీరోగా రామ్ పోతినేని సరికొత్త రికార్డు క్రియేట్ చేసాడు.
ప్రస్తుతం రామ్ డబుల్ ఇస్మార్ట్ తో బిజీగా ఉన్నాడు. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటూ రిలీజ్ కు సిద్దమవుతుంది. ఆగష్ట్ 15 వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచారు. ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా మాస్ ఎలిమెంట్స్ తో టీజర్ ఆకట్టుకుంది. ఈసినిమాలో కావ్యా థాపర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమాలో ఇంకా బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇంకా ఈసినిమాలో అలీ, షయాజీ షిండే, గెటప్ శ్రీను, ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ఈసినిమాను పూరి కనెక్ట్స్ పై పూరీ జగన్నాథ్, ఛార్మి కలిసి నిర్మించనున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. శ్యామ్ కే నాయుడు, జియాని జియానెలి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























