వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న సినిమా సరిపోదా శనివారం. అంటే సుందరానికి తర్వాత నాని-వివేక్ ఆత్రేయ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈసినిమా యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతుంది. ఈసినిమా ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి పలు అప్ డేట్లు వచ్చాయి. అన్నీ సినిమాపై మంచి క్యూరియాసిటీని పెంచాయి. రీసెంట్ గానే ఎస్ జే సూర్య పుట్టినరోజు సందర్బంగా ఆయన గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేయగా గ్లింప్స్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు ఈసినిమా నుండి మరో క్రేజీ అప్ డేట్ తో వచ్చారు మేకర్స్. ఈసినిమాలో ఒకప్పటి హీరోయిన్ అభిరామి కూడా ఒక కీలకపాత్రలో నటిస్తుంది. ఈనేపథ్యంలో నేడు తన పుట్టినరోజు సందర్భంగా అభిరామి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈసినిమాలో అభిరామి ఛాయాదేవి అనే పాత్రలో నటిస్తున్నట్టు తెలిపారు.
కాగా ఈసినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాలో తమిళ్ టాలెంటెడ్ నటుడు ఎస్ జే సూర్య కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ పై నిర్మిస్తున్నారు. సెన్సేషనల్ కంపోజర్ జేక్స్ బిజోయ్ సంగీతం అందించగా, మురళి జి సినిమాటోగ్రాఫర్, కార్తీక శ్రీనివాస్ ఎడిటర్. ఈ పాన్ ఇండియా చిత్రం ఆగస్టు 29, 2024న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































