సిల్వర్ స్క్రీన్ పైన తమ అభిమాన హీరో పేరు కనబడగానే ఈలలు, కేకలతో థియేటర్లు దద్దరిల్లిపోయేలా చేస్తుంటారు ఫ్యాన్స్. పేపర్లు చించి పైకి ఎగురవేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తుంటారు. అసలు ఈ క్షణం కోసమే వేచి చూస్తున్నారా అన్నట్టు ఉంటారు అభిమానులు. అయితే ఇవన్నీ తెలుగు రాష్ట్రాల్లో సర్వసాధారణ విషయం. స్టార్ హీరో చిత్రం రిలీజ్ అయినప్పుడు వారి అభిమానుల ఆనందానికి హద్దే ఉండదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక వీరి కోసమే అన్నట్టుగా దర్శకులు కూడా హీరోల పేర్లు తెరపై కనిపించే సమయంలో ప్రత్యేకమైన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్పెషల్ ఎఫెక్ట్స్ కానీ ఉపయోగిస్తుంటారు. అయితే ఆయా హీరోల పేర్లు అసలైనవేనా? లేదంటే వారు సినిమాలకోసం మార్చుకున్నారా? అంటే.. అందరూ అని చెప్పలేం కానీ, కొందరు నటులు మాత్రం తమ పేర్లను మార్చుకున్నారు. చిత్ర పరిశ్రమలోకి వచ్చాక ఆడియెన్స్ కి క్యాచీగా ఉండేందుకు కావొచ్చు.. లేక, న్యూమరాలజీ ప్రకారం లక్ కలిసిరావడం కోసం కావొచ్చు.. కొందరు నటులు తమ అసలు పేర్లను మార్చుకున్నారు.
వివిధ కారణాలతో ఆయా నటులు తమ పేర్లను మార్చుకున్నారు. అయితే ఆశ్చర్యకరంగా వారు మార్చుకున్న పేర్లతోనే సక్సెస్‌తో పాటు పాపులారిటీ కూడా సంపాదించుకున్నారు. ఇలా పేరు మార్చుకున్నవారిలో పలువురు స్టార్ హీరోలు ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి అసలు పేరేంటో అందరికీ తెలిసిన విషయమే. తాజాగా ఆకాష్ పూరి కూడా తన పేరు మార్చుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పేరు మార్చుకున్న మరికొందరు ప్రముఖ హీరోల గురించి ఇక్కడ తెలుసుకుందాం..
- శోభనా చలపతి రావు – శోభన్ బాబు
- శివశంకర్ వర ప్రసాద్ – చిరంజీవి
- మంచు భక్తవత్సలం నాయుడు – మోహన్ బాబు
- వెంకట నారాయణ – రాజేంద్ర ప్రసాద్
- జగపతి రావు చౌదరి – జగపతి బాబు
- కళ్యాణ్ బాబు – పవన్ కళ్యాణ్
- రవిశంకర్ రాజు – రవితేజ
- నవీన్ బాబు – నాని
- సాయి ధరమ్ తేజ్ – సాయి దుర్ఘ తేజ్
- దినేష్ నాయుడు – విశ్వక్ సేన్
- నందమూరి ఓబులేసు – తారక రత్న
- అడివి సన్నీ చంద్ర – అడివి శేష్
- ఆకాష్ పూరి – ఆకాష్ జగన్నాథ్
ఇక వీరితోపాటుగా కోలీవుడ్ స్టార్ హీరోలు రజినీకాంత్ మరియు కమల్ హాసన్ కూడా తమ పేర్లను మార్చుకున్నారు. రజినీకాంత్ అసలు పేరు శివాజీ రావ్ గైక్వాడ్ కాగా.. కమల్ ఒరిజినల్ నేమ్ పార్థసారథి శ్రీనివాసన్. వీరే కాకుండా పలువురు కథానాయికలు, క్యారక్టర్ నటులు కూడా సిల్వర్ స్క్రీన్ కోసం తమ అసలు పేర్లను మార్చుకున్నారు.
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్‌ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























