దేశవ్యాప్తంగా ఉన్న టాలెంటెడ్ నటుల్లో ధనుష్ ఒకరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ధనుష్ కూడా భాషతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. అవుట్ అండ్ అవుడ్ యాక్షన్ డ్రామాకా వస్తున్న ఈసినిమాకు ధనుష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈసినిమాను ప్రకటించినప్పటి నుండి సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక జులై 26వ తేదీన రిలీజ్ కానున్న ఈసినిమా నుండి ఇప్పటికే టీజర్, ట్రైలర్ తో పాటు పలు పాటలను కూడా రిలీజ్ చేేేశారు. అప్ డేట్లు అన్నీ సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తిచేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఈవిషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా తెలియచేసింది. ఈసినిమాకు ఏ సర్టిఫికెట్ ను అందించారు చిత్రబృందం. అయితే సినిమాలో కాస్త వయోలెన్స్ ఉండటంతో ఏ సర్టిఫికెట్ దక్కింది. ఈనేపథ్యంలోనే సెన్సార్ బృందం కొన్ని మార్పులు కూడా చెప్పినట్టు తెలుస్తుంది. ఓవరాల్ గా సినిమాపై, ధనుష్ డైరెక్షన్ పై ప్రశంసలు కూడా కురిపించినట్టు సమాచారం.
కాగా ఈసినిమాలో ఇంకా ఎస్.జే.సూర్య, ప్రకాష్ రాజ్, సెల్వరాఘవన్, అపర్ణా బాలమురళి, ధుషార విజయన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమిళ్ టాప్ నిర్మాణ సంస్థ అయిన సన్ పిక్చర్స్ బ్యానర్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఓం ప్రకాశ్ డీవోపీగా అలానే యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా పీటర్ హెయిన్ వ్యవహరిస్తున్నారు. తెలుగు రిలీజ్ హక్కులను ప్రముఖ నిర్మాత అలాగే డిస్ట్రిబ్యూటర్ అయినటువంటి సురేష్ బాబు అలాగే ఏషియన్ వారు సొంతం చేసుకున్నారు. దీనితో తెలుగు రాష్ట్రాల్లో ఈసినిమాను ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పి వారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























